సీనియర్ కమెడియన్ చెప్పిన షాకింగ్ నిజం

Tue Jun 28 2022 09:37:18 GMT+0530 (IST)

The truth told by the senior comedian

నటులు రాజకీయాల్లోకి రావడం అన్నది చాలా సహజమైన ప్రక్రియ. అందరిలానే 30 ఇయర్స్ పృథ్వీ కూడా రాజకీయాల్లోకి  వెళ్లారు. వైకాపా పార్టీకి గత ఎన్నికల్లో అనంతరం కూడా తన సేవలందించారు.కానీ వన్ ఫైన్ డే తనకు ఎదురైన అవమానాలకు తట్టుకోలేక పృథ్వీ పార్టీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇక వైకాపాలో ఉన్నన్నాళ్లు అతడు ప్రత్యర్థులపై చెడామడా చెలరేగిపోయేవారు. తేదేపా నాయకులు చంద్రబాబు - లోకేష్ .. జనసేనాని పవన్ కల్యాణ్ వంటి వారిపైనా కూడా పృథ్వీ వాక్భాణాలు సంధించారు. కొన్నిసార్లు నటసింహా నందమూరి బాలకృష్ణ ను ఆయన ఇమ్మిటేట్ చేయడం తెలిసిందే.

అయితే బాలయ్య బాబుతో పృథ్వీ సమీకరణం ఇప్పుడు ఎలా ఉంది?  బాలయ్యకు సెట్లో ఎదురుపడితే పృథ్వీ సన్నివేశం ఎలా ఉంటుంది? అన్నదానికి ఆయనే సమాధానమిచ్చారు. నిజానికి బాలయ్య బాబు ఇలాంటివి మనసులో పెట్టుకోరని తెలిపారు. రాజకీయాలు వేరు సినిమాలు వేరు. రెండిటినీ కలపకూడదని ఆయన తనతో అన్నట్టు వెల్లడించారు.

ఒకప్పుడు నేను నందమూరి బాలకృష్ణ గారితో సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నా రాజకీయ ఉద్దేశాలకు అనుగుణంగా ఆయన నన్ను 'ఏం వైసీపీ' అని పిలిచారట. రాజకీయాలు సినిమా రెండూ భిన్నమైన అంశాలని తనతో అన్నారు.

వ్యక్తిగత బంధాల మధ్యకు రాజకీయాలను రానివ్వలేదని వెల్లడించారు. నేను అతనిని బాబాయి అని ప్రేమగా పిలుస్తాను అని పృథ్వీ చెప్పారు. లోకేష్ .. చంద్రబాబును విమర్శించాలని తనని వైకాపా నాయకులు బలవంతం చేసినట్టు కూడా పృథ్వీ వెల్లడించారు.

థర్టీ ఇయర్స్ పృథ్వీ టాలీవుడ్ లో బిజీయెస్ట్ ఆర్టిస్ట్. ఏడాదికి డజను సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక కరోనాలో అందరిలానే తాను కూడా కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు కంబ్యాక్ అదిరిందని అతడి బిజీ షెడ్యూల్స్ చెబుతున్నాయి.