వెటరన్ హీరోలు ఇంకా వేచి చూసే ధోరణి?

Tue Jun 15 2021 12:07:41 GMT+0530 (IST)

The trend that veteran heroes are still waiting for?

సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతుండడంతో తిరిగి కృష్ణానగర్ ఫిలింనగర్ లో షూటింగుల సందడి మొదలైంది. గణపతి కాంప్లెక్స్ వద్ద సీరియల్ నటీనటులు సినీ ఆర్టిస్టుల్లో తిరిగి కదలిక మొదలైంది. వాహనాలు స్ట్రిక్టుగా వ్యాక్సినేషన్ పూర్తయిన తారల్ని.. కార్మికులను పికప్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం వ్యాక్సినేషన్ భరోసాని పెంచుతోంది.ఇదే నేపథ్యంలో ఇప్పటికే ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉన్న పాతిక సినిమాల వివరాలని ఇంతకుముందు వెళ్లడించాం. తాజా సమాచారం మేరకు మారుతి - సంతోష్ శోభన్ మూవీ.. నితిన్ మ్యాస్ట్రో చిత్రీకరణలకు రెడీ అవుతున్నాయి. చైతన్య- సమంత మూవీ మూడోవారంలో మొదలు పెడతారు. చైతూ థాంక్యూ ... సామ్ శాకుంతలం మొదలు పెట్టేందుకు షెడ్యూల్స్ వేశారు.

అయితే అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి.. నటసింహా నందమూరి బాలకృష్ణ కాస్త వేచి చూసే ధోరణిని అనుసరిస్తున్నారు. చిరు- ఆచార్య జూలైలో .. అఖండ నెలాఖరున ప్రారంభం కానున్నాయని తెలిసింది. ఆచార్యతో పాటు ఆర్.ఆర్.ఆర్ కూడా వచ్చే నెల ఆరంభంలో చిత్రీకరణకు వెళుతుంది. చరణ్.. తారక్ .. ఆలియా కలయికలో సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. అల్లు అర్జున్ జూలై 1 నుండి పుష్పా షూటింగులో చేరతారు.

ప్రభాస్ విషయానికి వస్తే రాధేశ్యామ్ పెండింగ్ చిత్రీకరణ ముగించడానికి ముందే వచ్చే వారం నుంచి ముంబైలో ఆదిపురుష్ 3డి షూటింగ్ ను ప్రారంభించనున్నారు. జూలైలో వెంకటేష్ ఎఫ్ 3 ... రవితేజ ఖిలాడి పెండింగ్ పాటను పూర్తి చేయనున్నారు. ఇతర సినిమాల షెడ్యూల్స్ ని ప్రకటించే వీలుంది. జూలై నుంచి షూటింగులు జోరందుకుంటాయి కాబట్టి 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో సందడి ఉంటుందని ఆశిస్తున్నారు.