Begin typing your search above and press return to search.

'ఉప్పెన' టీమ్ కి అభినంద‌న‌లు..అలాగే పుష్ప‌ టీజ‌ర్ రెడీ

By:  Tupaki Desk   |   5 March 2021 2:30 AM GMT
ఉప్పెన టీమ్ కి అభినంద‌న‌లు..అలాగే పుష్ప‌ టీజ‌ర్ రెడీ
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న పుష్ప షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మేకర్స్ సమయం ఎంత‌మాత్రం వృధా చేయటం లేదు. ఎట్టిప‌రిస్థితిలో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ ముగించేయాల‌న్న త‌ప‌న‌తో టీమ్ రౌండ్ ది క్లాక్ ప‌ని చేస్తోంది.

తాజా స‌మాచారం మేర‌కు.. పుష్ప‌ టీజర్ సిద్ధం చేస్తున్నార‌ని తెలిసింది. టీజర్ ఏప్రిల్ 8 న బన్నీ పుట్టినరోజు కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు. ఈ రోజు టీజర్ పని ప్రారంభమైంది. ఫైన‌ల్ టీజ‌ర్ కోసం బన్నీ- సుకుమార్ వెయిట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల క‌రెక్ష‌న్స్ తో అనేక వెర్షన్లు సిద్ధం చేశార‌ని తెలుస్తోంది. అలాగే ఈ మూవీ పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ‌వుతోంది కాబ‌ట్టి.. ఇత‌ర భాష‌ల టీజ‌ర్ల‌ను ఒకేసారి రిలీజ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు బ‌న్ని కోసం అందుబాటులో ఉన్న థియేట‌ర్ లో ఉప్పెన చిత్రాన్ని ప్ర‌దర్శించ‌గా.. సినిమా వీక్ష‌ణ అనంత‌రం స‌క్సెస్ మీట్ లో చిత్ర‌బృందాన్ని ప్ర‌శంసించారు. వైష్ణవ్ తేజ్- దర్శకుడు బుచ్చిబాబు సహా మైత్రి మూవీ మేకర్స్ శుభాకాంక్ష‌లు తెల‌ప‌డ‌మే గాక‌... కంటెంట్ ని బ‌న్ని పొగిడేశారు. ఇక ఉప్పెన అంత పెద్ద హిట్ట‌య్యింది కాబ‌ట్టి ఇదే ఉత్సాహంలో బ‌న్ని పుష్ప కోసం మైత్రి సంస్థ అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తూ రాజీ లేకుండా భారీ పెట్టుబ‌డులు పెట్ట‌నుందిట‌.