నితిన్ కి 'నో' చెప్పిన స్టార్ హీరోయిన్...?

Tue Aug 04 2020 14:00:25 GMT+0530 (IST)

The star heroine who said 'no' to Nitin ...?

టాలీవుడ్ యువ హీరో నితిన్ 'భీష్మ' సినిమా సక్సెస్ తో వరుస ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతూ దూకుడు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన ''అంధాదున్'' మూవీని తెలుగులో రిమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. హిందీ 'అంధాదున్' సినిమాకి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించగా ఆయుష్మాన్ ఖురానా - రాధికా ఆప్టే హీరో హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటు సీనియర్ హీరోయిన్ టబు ఈ మూవీలో కీలక పాత్రలో నటించింది. కాగా నితిన్ నటించినబోయే ఈ సినిమా తెలుగు రీమేక్ కి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మరియు నికిత రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం.ఇదిలా ఉండగా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుతున్న చిత్ర యూనిట్ మిగతా లీడ్ క్యారెక్టర్స్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో రాధికా ఆప్టే పాత్రని తెలుగులో ఎవరు పోషిస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హీరోయిన్ వేటలో ఉన్న మేకర్స్ ఓ స్టార్ హీరోయిన్ ని సంప్రదించారట. అయితే ఆ హీరోయిన్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వలన డేట్స్ అడ్జస్ట్ చేయలేనని చెప్పి ఈ ఆఫర్ రిజెక్ట్ చేసిందని ఫిలిం సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా సదరు హీరోయిన్ మాత్రం 'నో' అనేసిందట. దీంతో ఇప్పుడు వేరే హీరోయిన్ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసారని సమాచారం. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న ''రంగ్ దే'' సినిమా కంప్లీట్ అయిన వెంటనే 'అంధాదున్' తెలుగు రీమేక్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది.