బోయ్ ఫ్రెండ్ ఇంటి నుంచి స్కిప్ కొడుతూ కెమెరాకి చిక్కిన స్టార్ హీరోయిన్

Tue Feb 23 2021 09:13:05 GMT+0530 (IST)

The star heroine is entangled with the camera while skipping from her boyfriend house

అవును.. బోయ్ ఫ్రెండ్ ఇంటి నుండి స్కిప్ కొడుతూ కెమెరా కంటికి చిక్కింది  ఆ స్టార్ హీరోయిన్. తనని అనుసరిస్తున్న మీడియా కెమెరాలకు చిక్కకుండా చకచకా అక్కడి నుంచి పలాయనం చిత్తగించేందుకు ప్రయత్నించింది. మీడియా నుంచి ఎట్నుంచి ఏ ప్రశ్న ఎదురవుతుందో అర్థం కాని గందరగోళంలో సదరు భామామణి కన్ఫ్యూజన్ లో కనిపించింది. ఏది ఏమైనా తన ఎఫైర్ పై వినిపిస్తున్న గుసగుసలకు ఈ సంఘటనతో మరింతగా ఫైర్ యాడ్ చేసినట్టయ్యింది.ప్రస్తుతం బాలీవుడ్ లో ఏ నోట విన్నా ఇవే గుసగుసలు. టాలీవుడ్ లో రెండు సినిమాలు చేశాక.. ఇక బాలీవుడ్ కే అంకితమవ్వడం వెనక ఆ రహస్య స్నేహితుడే కారణం అన్న గుసగుసా ఇటీవల బయటికి వినిపించింది. మొన్నటికి మొన్న నూతన సంవత్సర వేడుకలు పేరుతో మాల్దీవుల విహారానికి జంటగానే వెళ్లారు. కానీ ఒంటరిగా తిరిగొచ్చి అందరినీ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు. మాల్దీవుల నుంచి సింగిల్స్ ఫోటోల్ని మాత్రమే షేర్ చేసి జంట ఫోటోల్ని దాచేశారు.

తాజాగా సదరు స్నేహితుడి ఇంటి నుంచి వెళుతూ మరోసారి కెమెరా కంటికి చిక్కింది. ఇక దీంతో ఆ ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతోపాటు ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ కూడా జోరుగా సాగుతోందన్న గుసగుసలు మరింత ఊపందుకున్నాయి. ఇంతకీ ఎవరీ జంట? అంటే... ఇంకెవరు.. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా- కియరా అద్వాణీ జంట గురించే. ఆ ఇద్దరూ ప్రస్తుతం షేర్షా చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఆ క్రమంలోనే ఎంతో క్లోజ్ అయిపోయారు. ఒకరిని విడికి ఒకరు ఉండలేనంతగా మమైకం అయిపోయారన్న గుసగుసలు వేడెక్కిస్తున్నాయి. ప్రస్తుతం షేర్షాతోపాటు భూల్ భులయ్యా- జగ్ జగ్ జీయో చిత్రాలతో కియరా ఫుల్ బిజీగా ఉంది.