Begin typing your search above and press return to search.

ఆ వ్యక్తితో 13 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ ప్రేమ.. త్వరలోనే పెళ్లి!

By:  Tupaki Desk   |   25 Jan 2023 2:00 PM GMT
ఆ వ్యక్తితో 13 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ ప్రేమ.. త్వరలోనే పెళ్లి!
X
సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు ఈ మధ్య స్టార్ హీరోలు హీరోయిన్లు. కొంతమంది ప్రేమ పెళ్లి చేసుకుంటుంటే... మరి కొంతమంది పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే మహానటితో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఒక స్టార్ హీరోయిన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు తెలుస్తోంది.

ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో నిలిచిపోయిన స్టార్ హీరోయిన్ పెళ్లిపై చర్చ జరుగుతుంది. గత యేడాది మహేష్ తో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ గురించి ఇండస్ట్రీలో ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది. ఈ స్టార్ హీరోయిన్ తన చిన్ననాటి బాల్య స్నేహితుడు తో ప్రేమలో ఉన్నట్టు సినిమా వర్గాల సమాచారం. అయితే వీళ్ళ ప్రేమ గత 13 ఏళ్లుగా కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది.

ఆ వ్యక్తి ఎవరో కాదు కేరళ రీసర్ట్ ఓనర్ అని అంటున్నారు. అయితే వీళ్ళ ప్రేమని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్త హల్చల్ చేస్తోంది. ప్రస్తుతానికి వీళ్ళ పెళ్లి నాలుగేళ్ల తర్వాత జరుగుతుందని సమాచారం.

గతంలో ఈ బ్యూటీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ తో కూడా ప్రేమలో ఉన్నట్లుగా కథనాలు వెలబడ్డాయి. అయితే అందులో ఇలాంటి నిజం లేదు అని కూడా ఆమె తల్లిదండ్రులు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా ఒక అగ్ర హీరోతో ప్రేమలో ఉన్నట్లు కథనాలు వస్తూ ఉండడంతో ఆమె పేరు సోషల్ మీడియాలో మరింతగా వైరల్ అవుతుంది. మరి ఈ విషయంపై ఆమె అధికారికంగా స్పందిస్తుందో లేదో చూడాలి.

ఇక ఈ భామ అప్పట్లో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించినప్పటికీ అంతగా సక్సెస్ కాలేదు. ఇక కమర్షియల్ బాట పట్టిన ఈ హీరోయిన్... ప్రస్తుతం ఫుల్ వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతుంది. త్వరలోనే నాని, చిరంజీవి నటించిన సినిమాలు విడుదల కానున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.