స్టార్ డైరెక్టర్ తన భార్యతో విడిపోడానికి ఆ హీరోయినే కారణమట..!

Fri May 07 2021 16:00:02 GMT+0530 (IST)

The star director is the reason for the heroine to break up with his wife ..!

టాలీవుడ్ లో వైవిధ్యమైన సినిమాలు కంటెంట్ బేస్డ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ ఒకరు. ఈ క్రమంలో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. ఎన్నో అవార్డులను రివార్డులను సొంతం చేసుకున్నాడు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో వర్క్ చేసిన సదరు దర్శకుడు.. కోలీవుడ్ - బాలీవుడ్ లలో కూడా సత్తా చాటాడు. ఆ మధ్య రెండు ప్లాప్స్ తో కాస్త డీలా పడ్డాడు కానీ.. ఇప్పుడు ఓ స్టార్ హీరోతో చేసే భారీ సినిమాతో ఫార్మ్ లోకి రావాలని చూస్తున్నాడు. అయితే ఆ దర్శకుడు సినీ కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా సాగిస్తున్నప్పటికి.. పర్సనల్ లైఫ్ మాత్రం లీడ్ చేయలేకపోయాడు.నాలుగేళ్ళ క్రితం దర్శకుడిగా మంచి ఫార్మ్ లో ఉన్నప్పుడు అతని వివాహం జరిగింది. అయితే రెండేళ్ల దాంపత్య జీవితం కొనసాగించిన ఈ జంట కొన్ని మనస్పర్థల కారణంగా చట్టబద్ధంగా విడాకులు తీసుకొని విడిపోయారు. డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన కొద్దికాలంలోనే భార్యతో విడిపోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అయితే వీరిద్దరూ విడిపోయిన ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఆ దర్శకుడు తన భార్యతో విడిపోవడానికి ఆయనతో పని చేసిన ఓ హీరోయిన్ కారణమట. సదరు డైరెక్టర్ ఆ హీరోయిన్ తో సన్నిహితంగా ఉండటం భరించలేని ఆయన భార్య.. ఈ విషయంపై పలుమార్లు హెచ్చరించిందట. అయినా మార్పు రాకపోవడంతో పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకుని కోర్టును ఆశ్రయించారట. ఆ తర్వాత వీరికి కోర్టు విడాకులు మంజూరు చేయడం.. విడిపోవడం.. ఆ డైరెక్టర్ మళ్ళీ సినిమాలతో బిజీ అవడం జరిగిపోయాయి.