స్టార్ కపుల్ విడాకులు... ఆమె నా అదృష్టం!

Fri Sep 30 2022 21:00:01 GMT+0530 (India Standard Time)

The star couple's divorce... She's my luck!

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపిక పడుకునే.. రణ్ వీర్ సింగ్ వివాహ బంధానికి నాలుగు సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే విడిపోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. రణ్వీర్ సింగ్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఈ మధ్య కాలంలో దీపిక కొన్ని సార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని.. అందుకే ఆయన నుండి విడిపోయే ఉద్దేశ్యంతోనే దీపిక ఉందంటూ ప్రచారం జరుగుతోంది.ఆ విషయమై రణ్వీర్ సింగ్ తాజాగా తన ప్రకటనతో క్లారిటీ ఇచ్చాడు. విడాకుల గురించి మాట్లాడకుండానే తామిద్దరం కలిసి ఉన్నాం.. కలిసి ఉండబోతున్నాం అన్నట్లుగా పేర్కొన్నాడు. తాజాగా రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ... మేము ఇద్దరం 2012 సంవత్సరంలో ప్రేమలో పడ్డాం. ఇది 2022 సంవత్సరం. కనుక మా ప్రేమకు పదేళ్లు. ఈ పదేళ్ల కాలంలో ఆమె నుండి ఎన్నో అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాను.

త్వరలో మీ అందరిని సర్ ప్రైజ్ చేసే విధంగా మళ్లీ జంటగా మీ ముందుకు రాబోతున్నాం.  దీపిక ఈ జన్మకు దక్కిన అత్యంత గొప్ప అదృష్టంగా భావిస్తాను. ఆమె జీవితంలో ఎంతో కీలకం అన్నట్లుగా రణ్వీర్ సింగ్ మాట్లాడటంతో ఇద్దరి మధ్య ఎంత మంచి బాండ్డింగ్ ఉందో క్లారిటీ వచ్చింది. మీడియాలో పిచ్చి పుకార్లను నమ్మి అభిమానులు కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.

తాజాగా రణ్వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య సఖ్యత అంతా సజావుగా ఉందని నిరూపితం అయ్యింది. మరింత సాక్ష్యం అన్నట్లుగా ఇటీవల ముంబయిలో దీపిక తీవ్ర అనారోగ్య సమస్యతో బాధ పడ్డ సమయంలో ఆమె పక్కనే హాస్పిటల్ లో రణ్వీర్ సింగ్ ఉన్నాడు. ఆమె తో హాస్పిటల్ కి వెళ్లాడు.. ఆమెతో పాటే బయటకు వచ్చాడు. కనుక ఇద్దరి మధ్య అంతా బాగానే ఉందని దాన్ని బట్టి కూడా క్లారిటీ వచ్చింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.