Begin typing your search above and press return to search.

#బెస్ట్ నేస్తాలు.. ఏం వండుతున్నారో కానీ!

By:  Tupaki Desk   |   25 Jan 2022 3:39 PM GMT
#బెస్ట్ నేస్తాలు.. ఏం వండుతున్నారో కానీ!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఫ్యామిలీలో ప్ర‌తి ప్ర‌త్యేక సంద‌ర్భాన్ని సోష‌ల్ మీడియాల్లో అప్ డేట్ చేస్తారు న‌మ్ర‌త‌. వ్య‌క్తిగ‌త వృత్తిగ‌త విష‌యాల్ని షేర్ చేస్తుంటారు. కిడ్స్ గౌత‌మ్ - సితార‌ల ఫ‌న్నీ విష‌యాల్ని ఫోటోలు వీడియోల రూపంలో షేర్ చేస్తుంటారు. అలా అభిమానుల‌కు ట‌చ్ లో ఉండ‌డం న‌మ్ర‌త‌ వ్యాప‌కం.

తాజాగా న‌మ్ర‌త షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. మహేష్ త‌న గారాల కుమారుడు గౌతమ్ తో క‌లిసి ఏదో ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇద్దరూ సాధారణ దుస్తులు ధరించారు. ఆ ఇద్ద‌రూ ఏదో కుక్ చేస్తున్నారు. వంట ఏమిటనేది ఎవరూ గుర్తించలేం కానీ ఆ ఇద్ద‌రి మధ్యా అనుబంధం మాత్రం అర్థ‌మ‌వుతోంది. అక్కడ మహేష్ అతని కొడుకు ఒకరినొకరు తథేకంగా చూస్తున్నారు.

ఈ ఫోటోని షేర్ చేసిన న‌మ్ర‌త ఒక వ్యాఖ్య‌ను జోడించారు. ``ఇప్పుడు ఏమి వండుతున్నారో అర్థం కావడం లేదు. #బెస్ట్ నేస్తాలు`` అని వ్యాఖ్యానించారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. మహేష్ బాబు సర్కారు వారి పాటలో న‌టిస్తున్నారు. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం హిస్తున్నారు. కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్నందున చిత్రీక‌ర‌ణ వాయిదా ప‌డింది. త్వరలో ఫస్ట్‌ సింగిల్ ని విడుదల చేయనున్నారు.