Begin typing your search above and press return to search.

'ఏజెంట్ సాయి..'కి కొనసాగింపుగా మరో రెండు సినిమాలు : ప్రొడ్యూసర్

By:  Tupaki Desk   |   3 Aug 2020 1:30 AM GMT
ఏజెంట్ సాయి..కి కొనసాగింపుగా మరో రెండు సినిమాలు : ప్రొడ్యూసర్
X
తెలుగులో చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ ద‌గ్గర భారీ విజ‌యం నమోదు చేసింది ''ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌''. షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారక్టర్.. ఈ ఏజెంట్ ఆత్రేయ ఒరిజినల్ అంటూ వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. యువ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి స్వరూప్ ఆర్ఎస్‌జె దర్శకత్వం వహించాడు. 'మళ్ళీరావా' ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మించారు. కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన 'ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌'లో యంగ్ డిటెక్టివ్ గా నవీన్ అదరగొట్టాడు. ఇక ఈ చిత్రం జపాన్ భాషలోకి అనువాదం చేయబడి త్వరలోనే విడుదల కానుందని సమాచారం. ఇంతటి ఘనత సాధించిన ఈ చిత్రానికి కొనసాగింపుగా మ‌రో రెండు భాగాలు రానున్నాయి.

కాగా నేడు 'ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌' నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా పుట్టినరోజు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ' రెండో భాగం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. డైరెక్టర్ స్వరూప్ త‌న రెండో సినిమా పూర్తవ‌గానే ఏజెంట్ సెకండ్ పార్ట్‌ ను స్టార్ట్ చేస్తాం. స్క్రిప్ట్ రెడీ అవుతున్న విధానానికి మేం చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నాం. త్వర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర వివ‌రాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. ఏజెంటుకి కొనసాగింపుగా రానున్న రెండు సినిమాలలో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఉంది. ఇక తెలుగులో సూపర్ సక్సెస్ సాధించిన ఈ సినిమాని హిందీ త‌మిళ‌ మ‌ల‌యాళ కన్నడ భాషల్లో రీమేక్ చేస్తున్నారు.