Begin typing your search above and press return to search.

#RRR ఆలియా రెడీ.. జ‌క్క‌న్న రెడీనా?

By:  Tupaki Desk   |   18 April 2021 11:27 AM GMT
#RRR ఆలియా రెడీ.. జ‌క్క‌న్న రెడీనా?
X
ఇది ఏ ద‌ర్శ‌కుడు ఊహించ‌నిది. అస‌లు కాల్షీట్లు దొర‌క‌డ‌మే క‌ష్టం అనుకుంటే ఆలియా లాంటి స్టార్ హీరోయిన్ త‌న‌కు తానుగానే పిలిచి షూటింగ్ కి వ‌స్తాను మ‌హా ప్ర‌భో అని ప్ర‌ధేయ‌ప‌డింద‌ట‌. దానికి ఆ ద‌ర్శ‌కుడి స‌మాధానం ఏంటో ఊహించారా?

అస్స‌లు కుద‌ర‌దు! అని చెప్పారట‌. ఇంత‌కీ ఈ సంభాష‌ణ ఎవ‌రి న‌డుమ? అంటే.. ఆర్.ఆర్.ఆర్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి .. అందాల ఆలియాభ‌ట్ కి న‌డుమ జ‌రిగిన‌ది. కోవిడ్ నుంచి కోలుకున్న ఆలియా ప్ర‌స్తుతం హిందీ సినిమాల షూటింగుల్లో పాల్గొన‌లేని ప‌రిస్థితి ఉంది. ముంబై మ‌హారాష్ట్ర‌ను కోవిడ్ అట్టుడికిస్తుంటే హైద‌రాబాద్ లో షూటింగులు సాగుతున్నాయి. అందుకే జ‌క్క‌న్న‌కు ఇచ్చిన క‌మిట్ మెంట్ పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించి అత‌డికి కాల్ చేసింద‌ట‌.

కానీ ఇక్క‌డ సీన్ ఏమంత బాలేదు. ఇటీవ‌లే ఆచార్య షూటింగ్ లో పాల్గొన్న సోనూసూద్ కి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ చిత్రం సెట్స్ లో అత‌డిని క‌లిసి రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం స్వీయ‌నిర్భంధంలో ఉన్నారు. ఇప్పుడు చ‌ర‌ణ్ - ఆలియా సీన్లు తీయాలంటే క‌ష్టం. నిజానికి ఆలియాతో షెడ్యూల్ పూర్తి చేయాల్సిన స‌మ‌యంలో ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దాంతో వాయిదా వేయాల్సి వ‌చ్చింది. ఇప్పుడు కోవిడ్ నుంచి కోలుకున్నాక‌ ఆలియానే స్వ‌యంగా జ‌క్క‌న్న అండ్ టీమ్ కి కాల్ చేసింది. కానీ వీలు ప‌డ‌ని స‌న్నివేశం క‌నిపిస్తోంది.

అలియా భట్ తెలుగు అరంగేట్ర చిత్ర‌మిది. ఇందులో కీల‌క‌మైన‌ సీత పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం నుండి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల తన పుట్టినరోజున విడుదలైంది. ప్రస్తుతానికి అక్టోబర్ 13 విడుదల తేదీని ప్ర‌క‌టించినా .. దేశంలో చాలా అనిశ్చితి ఉన్నందున స‌వ్యంగా అన్నిప‌నులు పూర్త‌వుతాయా లేదా? అన్న సందిగ్ధ‌త నెల‌కొంది.