Begin typing your search above and press return to search.

క్రాక్ డిజిటల్ హక్కుల అసలు ధర.. ఇదేనట!!

By:  Tupaki Desk   |   19 Jan 2021 6:03 AM GMT
క్రాక్ డిజిటల్ హక్కుల అసలు ధర.. ఇదేనట!!
X
మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘క్రాక్’ మూవీ సంక్రాంతి సందర్బంగా థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. సంక్రాంతికి ముందే అంటే జనవరి 9న విడుదలైన క్రాక్.. ఒంగోలులో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తెరకెక్కింది. పవర్ ఫుల్ యాక్షన్ అంశాలతో క్రాక్ మాస్ రాజా ఫ్యాన్స్ అంచనాలను అందుకుంది. క్రాక్ సినిమా మేకర్స్ విడుదలకు ముందే అన్ని రకాల ప్రమోషన్లతో ప్రేక్షకులలో ఆసక్తి పెంచేసారు. అటు ఆడియో పరంగా ఇటు థియేట్రికల్ ట్రైలర్ పరంగా క్రాక్ ఫుల్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది. కానీ తెలుగు రాష్ట్రాల థియేటర్లలో యాభై శాతం సీటింగ్ అనేది మాత్రం క్రాక్ సినిమాకు బిగ్ మైనస్.. అయినా సరే ఫస్ట్ డే నుండి పాజిటివ్ వైబ్ తో వసూళ్ల పరంగా కనకవర్షం కురిపిస్తోంది క్రాక్. ఇక మాస్ రాజా అభిమానులు మార్నింగ్ నుండి నైట్ సెకండ్ షో పడేవరకు వెయిట్ చేసి సినిమాను సూపర్ హిట్ చేశారు.

చివరిగా క్రాక్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. అటు క్రిటిక్స్ నుండి ఇటు ఆడియన్స్ నుండి మంచి స్పందన తెచ్చుకొని వసూళ్లపరంగా దూసుకెళ్తుందని సమాచారం. ఆల్రెడీ నిర్మాతను క్రాక్ సేఫ్ చేసేసిందట. అయితే ఈ సినిమా సగం సీటింగ్ లో కూడా బెస్ట్ గానే వసూల్ చేస్తోందని చెప్పవచ్చు. ఇక క్రాక్ సినిమా త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అల్లు అరవింద్ ఆహా ఓటిటిలో ఈ సినిమాను ప్రదర్శించేందుకు డిజిటల్ హక్కులను భారీ ధరకే కొనుగోలు చేసాడట. బయట ఎన్ని పుకార్లు వినిపించినా అసలు ధర మాత్రం 8.2 కోట్లు అని సమాచారం. లాక్ డౌన్ తర్వాత ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా క్రాక్ రికార్డు సృష్టించింది. అయితే మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మించారు. ఇక క్రాక్ మూవీ జనవరి నెల ఆఖరిలో ఆహాలో స్ట్రీమ్ అవుతుందని సినీవర్గాలలో టాక్. చూడాలి మరి మాస్ రాజా క్రాక్ డిజిటల్ స్ట్రీమింగ్ ఎలా జోరు కొనసాగిస్తుందో..!