ఈ టైమ్ లో జాలీట్రిప్ కు వెళ్లిన నటుడికి షాక్ ఇచ్చిన పోలీసులు

Sat Aug 01 2020 19:30:25 GMT+0530 (IST)

The police shocked the actor who went on a trip

తమిళ నటుడు విమల్ మరియు సూరిలు షూటింగ్ లేవు కదా అనుకుని జాలీ ట్రిప్ వేద్దామనుకున్నారు. చెన్నై నుండి కొడైకెనాల్ వెళ్లారు. అక్కడ తెలిసిన వ్యక్తి వద్ద ఉంటూ జాలీగా గడిపారు. అడవిలోకి వెళ్లి కొలను వద్ద చేపలు పడుతూ టైం పాస్ చేస్తున్న సమయంలో అటవి శాఖ వారు వారిని గమనించారు. లాక్ డౌన్ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారంటూ ఫైన్ వేసి అక్కడ నుండి పంపించారు. ఫైన్ తో గొడవ పోయిందనుకున్న వారిద్దరికి ఆ వెంటనే షాక్ తలిగింది.లాక్ డౌన్ అమలు అవుతున్న ఈ సమయంలో ఎలాంటి పాస్ తీసుకోకుండా కారులో ప్రయాణం చేయడంతో పాటు కారణం లేకుండా బయటకు వచ్చినందుకు గాను కేసు నమోదు చేయడం జరిగింది. వారు ప్రయాణించిన ఒక కారు మరియు జీప్ లను కూడా పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. కొడైకెనాల్ లో వారికి ఆశ్రయం ఇచ్చిన ఖాదర్ బాషా అనే వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ముగ్గురు కూడా వ్యక్తిగత పూచి కత్తుపై బెయిల్ పొందారు. అయితే వారి కార్లు మాత్రం పోలీసుల ఆదీనంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కరోనా ఒక వైపు కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో బాధ్యత లేకుండా ఇలా జాలీ ట్రిప్స్ ఏంటో వారికే తెలియాలంటూ సినీ జనాలు మరియు సామాన్య జనాలు కూడా వారిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.