Begin typing your search above and press return to search.

రాబోయే మూడు నెలలు ప్రభాస్‌ కు స్పెషల్‌

By:  Tupaki Desk   |   10 May 2021 3:30 AM GMT
రాబోయే మూడు నెలలు ప్రభాస్‌ కు స్పెషల్‌
X
ఈమద్య కాలంలో హీరోలు ఒకే సారి రెండు మూడు సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా సినిమాలు కమిట్‌ అవుతూ ఉన్నారు. స్టార్‌ హీరోలు సినిమాకు సినిమాకు నెలల గ్యాప్ కూడా తీసుకుంటున్నారు. కాని అతి కొద్ది మంది మాత్రమే ఒక సినిమా సెట్స్ పై ఉన్న సమయంలోనే మరో సినిమాను మొదలు పెడుతున్నారు. కాని ప్రభాస్ మాత్రం ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు. నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సినిమా త్వరలో షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.

రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. ఒక పాట మరియు ప్యాచ్‌ వర్క్‌ మినహా మొత్తం షూటింగ్‌ పూర్తి అయ్యింది. ఇక ఈనెల 15వ తారీకు నుండి హైదరాబాద్ లో ఆదిపురుష్‌ షూటింగ్‌ కు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యులు హైదరాబాద్‌ కు చేరుకున్నారు. రెండున్నర నుండి మూడు నెలల పాటు హైదరాబాద్ లో ఆదిపురుష్‌ షూటింగ్‌ కంటిన్యూస్‌ గా సాగుతుందని సమాచారం అందుతోంది. ఇదే సమయంలో సలార్ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ లో కీలక షెడ్యూల్‌ జరుపబోతున్నారు.

ఆదిపురుష్‌ మరియు సలార్‌ షూటింగ్‌ లు సమాంతరంగా జరుగబోతున్నాయి. గ్యాప్‌ లో రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్ లో కూడా ప్రభాస్ జాయిన్ అవ్వబోతున్నాడు. మొత్తంగా రాబోయే మూడు నెలల కాలంలో ఆదిపురుష్‌.. సలార్ మరియు రాధే శ్యామ్‌ షూటింగ్‌ లతో బిజీ బిజీగా ప్రభాస్ గడుపబోతున్నాడు. ఈ మూడు నెలల కాలంలో రాధేశ్యామ్‌ షూటింగ్‌ పూర్తి అవుతుంది. ఆదిపురుష్‌ కూడా దాదాపుగా పూర్తి అవుతుంది. ఇక సలార్‌ మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి అవుతుందని అంటున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ భయపెడుతున్నా కూడా ప్రభాస్ మాత్రం మూడు సినిమాల కీలక పార్ట్‌ ముగించేందుకు సిద్దం అయ్యాడు.