యంగ్ స్టార్స్ ను ఢీ కొట్టబోతున్న మెగాస్టార్

Wed Aug 12 2020 13:00:38 GMT+0530 (IST)

The megastar who is going to hit the Young Stars

టాలీవుడ్ లో ప్రస్తుతం మహేష్ ప్రభాస్ చరణ్ ఎన్టీఆర్ బన్నీ వంటి యంగ్ స్టార్ హీరోల టైం నడుస్తోంది. సీనియర్ హీరోల సినిమాలు ఇలా వచ్చి అలా పోతున్నాయి. ఒకటి రెండు సినిమాలు కాస్త పర్వాలేదు అనిపిస్తున్నా కూడా యంగ్ హీరోల మద్య టాలీవుడ్ రికార్డుల పరంపర కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి తన ఆచార్య చిత్రంతో వారికి గట్టి పోటీ ఇస్తాడని మెగా ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. పారితోషికం విషయంలో మహేష్ బాబు ఎన్టీఆర్ చరణ్ ఇతర స్టార్ హీరోల స్థాయిలో ఉన్న చిరంజీవి తన సినిమా ఆచార్య కలెక్షన్స్ విషయంలో కూడా వారితో పోటీ పడే అవకాశం ఉందని అంటున్నారు.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ చిత్రం వంద కోట్ల సినిమాగా నిలుస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రం కోసం చిరంజీవి 50 కోట్ల వరకు పారితోషికం తీసుకోవడంతో సినిమా బడ్జెట్ భారీగా ఉందని అంటున్నారు. ఇదే సమయంలో చరణ్ కు కూడా ఈ సినిమాకు గాను భారీగా పారితోషికంను ఆఫర్ చేశారు. కనుక సినిమా భారీ వసూళ్లను నమోదు చేస్తేనే బడ్జెట్ రికవరీ అవుతుంది. టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోల సూపర్ హిట్ చిత్రాల స్థాయిలో ఆచార్య వసూళ్లు సాధించాల్సి ఉంది. మరి మెగాస్టార్ పారితోషికం విషయంలోనే కాకుండా వసూళ్ల విషయంలో కూడా వారితో సరి ఉజ్జీగా నిలుస్తాడా అనేది చూడాలి.