బిజినెస్ లో వేలు పెట్టిన డైరెక్టర్ కి ట్రబుల్స్

Thu Sep 23 2021 11:02:31 GMT+0530 (IST)

The leading director seems to be facing similar pressures

లాభాల్లో వాటాలు పంచుకోవడమే కాదు.. నష్టాల్లోనూ వాటాలు పంచుకుంటానని మాటిస్తే గనుక ఈ రోజుల్లో అంతే సంగతి. లాభమో నష్టమో అంతా నాదే! అంటే తస్మాత్ జాగ్రత్త!! చూస్తుంటే టాలీవుడ్ కి చెందిన అపజయమెరుగని ప్రముఖ దర్శకుడు ఇలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్టే కనిపిస్తోందనేది ఫిలింనగర్ గుసగుస.కరోనా ముందు కరోనా తర్వాత సీన్ అంతా మారిపోయింది. నిర్మాతలకు ఆలస్యం వల్ల బడ్జెట్ తడిసి మోపెడవుతోంది. భారీ బడ్జెట్ చిత్రాలకు అన్నిటికీ ఇదే పరిస్థితి. దీంతో ఇప్పటికే మాట్లాడుకున్న బిజినెస్ డీల్ మేరకు మొత్తాల్ని రీకవరీ చేయాలంటే అది పెను సవాల్ గా మారనుంది. కరోనా ఓవైపు షంటేస్తుంటే.. మరోవైపు ఏపీలో టిక్కెట్టు ధరలు పెను సవాల్ గా మారాయి. దానికి తోడు జగన్ ప్రభుత్వం దిగి రాకపోవడం బెనిఫిట్ షోల రద్దు వగైరా అంశాలు పెద్ద సినిమాలకు పెద్ద హీరోలు దర్శకనిర్మాతలకు పెద్ద ఛాలెంజ్ గా మారిందని గుసగుస వినిపిస్తోంది. ఇది బిజినెస్ డీల్స్ కుదిర్చే ఆ ప్రముఖ దర్శకుడికి పెద్ద ఇబ్బందిగా మారిందట.

భారీ మల్టీస్టారర్ గా రూపొందిన ఈ సినిమా బిజినెస్ పూర్తిగా ఆ దర్శకుడితో ముడిపడి ఉంది. అతడు ఎగ్జిబిటర్లు బయ్యర్లు పంపిణీదారులను సమన్వయం చేస్తారు. ఒప్పందాలు కుదురుస్తారు. అందులో తన వాటాలు మాట్లాడుకుంటారు. స్నేహితుడే డిస్ట్రిబ్యూటర్ కావడంతో ఇద్దరూ కలిసి గేమ్ ఆడతారు. అందువల్ల ఆయనకు ఇప్పుడు అన్నీ చిక్కులే నంటూ ఒక గుసగుస ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తోంది. క్రైసిస్ వల్ల అదనంగా కోట్లాది రూపాయల బడ్జెట్ పెరిగింది. దానిని రికవరీ చేయడం ఎలానో గందరగోళంగా మారింది. దీంతో సదరు దర్శకుడు తన పారితోషికం ప్యాకేజీ విషయంలోనూ డైలమాలో పడే పరిస్థితి కనిపిస్తోందని.. ఈ ఊహించని సన్నివేశం తీవ్రంగా ఒత్తిడిని పెంచుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నాన్ థియేట్రికల్ హక్కుల పరంగా డీల్స్ బావున్నా థియేట్రికల్ గా మాత్రం పాతిక కోట్ల మేర డెఫిషిట్ ని ఎదుర్కోక తప్పదన్న గుసగుసా వైరల్ గా మారింది.