Begin typing your search above and press return to search.

ఓటీటీ వినోదం: జూన్ నెలలో రాబోతున్న సరికొత్త కంటెంట్..!

By:  Tupaki Desk   |   1 Jun 2021 4:30 PM GMT
ఓటీటీ వినోదం: జూన్ నెలలో రాబోతున్న సరికొత్త కంటెంట్..!
X
కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో థియేటర్స్ క్లోజ్ అవడంతో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కి ఆదరణ పెరిగింది. ఇంటికే పరిమితమైన జనాలు.. ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీలో వచ్చే కంటెంట్ ని చూస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా కంటెంట్‌ బాగుంటే చాలు ఆదరిస్తున్నారు. దీంతో ఇప్పటికే ఉన్న ఓటీటీ వేదికలకు పోటీగా సరికొత్త ఫ్లాట్ ఫార్మ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆడియన్స్ ని ఆకట్టుకోడానికి కొత్త కొత్త వెబ్ సిరీస్ లు - ఒరిజినల్ సినిమాలను స్ట్రీమింగ్ కి పెడుతున్నారు. జూన్ నెలలోనే ప్రముఖ ఓటీటీలలో రాబోతున్నట్లు కంటెంట్ వివరాలు ఒకసారి చూద్దాం!

తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' సరికొత్త వెబ్ సిరీస్ లు - సినిమాలతో పాటుగా డబ్బింగ్ సినిమాలతో రెడీ అయింది. టొవినో థామస్ హీరోగా నటించిన 'కాలా' అనే మలయాళ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి తీసుకొస్తున్నారు. జూన్ 4 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అలానే కార్తీక్ రత్నం - నవీన్ చంద్ర - సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన 'అర్ధ శతాబ్దం' చిత్రాన్ని జూన్ 11న ఆహాలో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేయనున్నారు. ఇదే క్రమంలో ప్రియదర్శి - నందినీ రాయ్ ప్రధాన పాత్రలతో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' (ఐఎన్‌జీ) వెబ్ సిరీస్ జూన్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'వన్' చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి 'ఆహా' లో జూన్ 25న స్ట్రీమింగ్ కి పెడుతున్నారు.

ఫ్రెష్ కంటెంట్ ని అప్లోడ్ చేస్తూ వస్తున్న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ.. జూన్ 4న 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ని స్ట్రీమింగ్ పెడుతోంది. స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఈ సిరీస్ ద్వారా వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతోంది. 'ఫ్యామిలీ మ్యాన్' కు కొనసాగింపుగా వస్తున్న ఈ సిరీస్ లో మనోజ్ భాజ్ పాయ్ - ప్రియమణి కూడా కీలక పాత్రలు పోషించారు. దర్శకద్వయం రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ని రూపొందించారు. ఇకపోతే కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన 'జగమే తంత్రం' చిత్రాన్ని నెట్ ఫఫ్లిక్స్ లో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ అవుతోంది. జూన్ 18 నుంచి ఈ సినిమాని డిజిటల్ రిలీజ్ చేయనున్నారు. ఇవే కాకుండా జూన్ నెలలో మరికొన్ని సినిమాలు - వెబ్ సిరీస్ లు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి.