Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ లో దొరికి జైలు అనుభ‌వించి విద్యార్థుల‌కు బుద్ధి చెప్పిన హీరో

By:  Tupaki Desk   |   20 Sep 2020 7:00 AM GMT
డ్ర‌గ్స్ లో దొరికి జైలు అనుభ‌వించి విద్యార్థుల‌కు బుద్ధి చెప్పిన హీరో
X
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం కేసు స‌రికొత్త డిబేట్ కి తెర లేపిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ ఎలాంటి మ‌త్తులో జోగుతోందో బ‌య‌టి ప్ర‌పంచానికి ఆవిష్క‌రించేలా చేసింది ఈ కేసు. ఈ కేసులో సీబీఐ విచార‌ణ‌లో ర‌క‌ర‌కాల విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. సుశాంత్ సింగ్ గంజాయికి బానిసయ్యాడని రియా చక్రవర్తి పేర్కొనడంతో అటుపై తీగ లాగిన నార్కోటిక్స్ వాళ్ల‌కి ఈ లింక్ ‌పై బాలీవుడ్ డొంకంతా క‌దిలింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) బాలీవుడ్ ప్రముఖులతో ఓ శ్వేత‌ పత్రాన్ని సిద్ధం చేస్తోందని నమ్ముతున్నారంతా. ఇప్ప‌టికే 25 మంది పేర్లను రియా తన ప్రకటనలో పేర్కొన్నట్లు ప్ర‌చార‌మ‌వుతోంది. డ్రగ్స్ తో బాలీవుడ్ ‌కు ఉన్న సంబంధం కొత్తది కాదు. గతంలో సినీ తారల ప‌ట్టుబ‌డ‌డం అంగీక‌రించ‌డం అటపై అరెస్టుల ఫ‌ర్వం తెలిసిన‌దే.

బాలీవుడ్ ప్రముఖుల‌ పేర్లలో మాదకద్రవ్యాల బానిసను అని అంగీకరించిన మొద‌టి హీరోగా సంజయ్ దత్ పేరు మార్మోగింది. ఒక గ్రాము కొకైన్ కోసం క‌క్కుర్తి ప‌డి అరెస్టయిన వారి జాబితాలో హీరో ఫర్దీన్ ఖాన్ ఉన్నారు.

తాను మాదకద్రవ్యాలకు బానిసయ్యానని అంగీకరించిన మొదటి నటులలో ఒకరైన సంజయ్ దత్ 80 వ దశకంలోనే ఊపిరితిత్తుల స‌మ‌స్య త‌లెత్త‌డంతో ఆ తరువాత డ్ర‌గ్స్ నుంచి వైదొలిగారు. ఇప్పుడు అతను ‘మాదకద్రవ్యాలకు నో చెప్పండి జీవితంలో పొందిక‌గా ఉండండి’ అని ప్రచారం చేస్తున్నారు. సంజ‌య్ ద‌త్ ప్ర‌స్తుతం క్యాన్స‌ర్ చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే.

రాజ్‌కుమార్ హిరానీ తెర‌కెక్కించిన‌ 2018 చిత్రం `సంజు`లో ద‌త్ జీ మాదకద్రవ్య వ్యసనాన్ని చూపించారు. ద‌త్ జీ ఏదైనా కళాశాల లేదా సంస్థను సందర్శించినప్పుడల్లా అతను మాదకద్రవ్యాల బానిసన‌ని విద్యార్థులతో బహిరంగంగా సంబోధిస్తాడు. తన అనుభవాన్ని పంచుకుని విద్యార్థులను వాటి ద‌రిదాపుల‌కు వెళ్ళవద్దని హెచ్చ‌రిస్తాడు. తోటివారి ఒత్తిడి మిమ్మల్ని ప్రలోభపెట్టవచ్చని అతను చెబుతుంటారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ప్రోత్సహించిన డ్రగ్-ఫ్రీ ఇండియా ప్రచారంలో దత్ ఇప్పుడు ఒక భాగం.

ఏదైనా డ్రగ్ పెడ్లర్ ‌ను అరెస్టు చేసినప్పుడల్లా.. అతను బాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేశాడని వెంటనే ఆరోపించడం తెలిసిన‌దే. ఇప్పుడు విదేశాలలో స్థిరపడిన ఒక నటి తన వ్యాపారవేత్త ప్రియుడితో కలిసి ఇలాంటి జీవితం గడిపేది. త‌న‌కు ఇప్పుడు అది విసుగుగా మారింది. సృజనాత్మక రంగంలో కిక్ అనే మ‌త్తు కోసం ధూమపానం డ్రగ్స్ సేవించే చిత్రనిర్మాతలు కళాకారులు చాలా మంది ఉన్నారు. మాదకద్రవ్యాల కనెక్షన్ ఉన్న పరిశ్రమ బాలీవుడ్ మాత్రమే కాదని నటి కునికా లాల్ అన్నారు. ``నేటి కాలంలో మ‌న‌మంతా ఆకాంక్షలతో పాటు అధిక ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నాము. మాదకద్రవ్యాలు ప్రతిచోటా ఉన్నాయి. అది మీడియా.. కార్పొరేట్ ప్రపంచం లేదా బ‌య‌టి ప్ర‌పంచానికి తెలీని మూడ‌వ ప్ర‌పంచ‌పు పార్టీల్లో అన్నిచోట్లా. బాలీవుడ్ ఎప్పుడూ అసురక్షిత జీవితంతో అసురక్షిత ప్రదేశంగా ఉంది అని స‌ద‌రు నటి చెప్పింది. బాలీవుడ్ లో ఈ త‌ర‌హా క‌థ‌లు ఎన్నో ఇప్పుడు నెటిజ‌నుల్లో హాట్ టాపిక్ గా మారాయి.