Begin typing your search above and press return to search.

ఓ దేశంపై కోపంతో రూ.265 కోట్ల ఆఫర్ వదిలేసిన హీరో

By:  Tupaki Desk   |   5 Dec 2021 3:30 AM GMT
ఓ దేశంపై కోపంతో రూ.265 కోట్ల ఆఫర్ వదిలేసిన హీరో
X
డబ్బు గడ్డి తినిపిస్తుందని అంటారు.. డబ్బు చెడును మంచిగా చూపిస్తుందని అంటారు.. కాని అది అన్ని సార్లు నిజం కాదని.. కొందరి విషయంలో నిజం కాదని అప్పుడప్పుడు నిరూపితం అవుతూ వస్తుంది. తాజాగా మరోసారి డబ్బు కంటే విలువలు.. నమ్మిన సిద్దాంతం.. మనస్సాక్షి ముఖ్యం అని నిరూపించాడు హాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ జార్జ్‌ క్లూనీ. సాదారణంగా ఒక బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరించేందుకు పలు విషయాలను పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. పారితోషికం ఎక్కువ వస్తే కొన్ని విషయాలను లైట్ తీసుకుని ఓకే చెప్తారు. సదరు బ్రాండ్‌ కు ఏదైనా లూప్‌ హోల్‌ లేదా లోపం ఉంటే పారితోషికం డబుల్‌ ఇచ్చిన సందర్బాలు కూడా ఉంటాయి. కొందరు అలాంటి వాటికి ఓకే చెప్తే మరి కొందరు మాత్రం నో అంటారు. జార్జ్‌ క్లూనీ ఒక చిన్న విషయంలో ఏకంగా రూ.265 కోట్ల ఆఫర్‌ ను తిరష్కరించాడు.

ఒక దేశంకు చెందిన ఎయిర్‌ లైన్స్ సంస్థను ప్రమోట్ చేయడం కోసం జార్జ్‌ క్లూనీ వద్దకు ఆఫర్ వచ్చింది. అందుకు గాను ఆ భారీ మొత్తంను ఆఫర్ చేశారు. కేవలం ఒక్క రోజు డేట్ కేటాయించి ఫొటో షూట్‌ మరియు చిన్న వీడియో ను రికార్డ్‌ చేస్తాం అన్నారు. ఏడాది కాలానికి గాను ఆయన ప్రమోషన్‌ స్టప్‌ ను వినియోగిస్తారు. ఒక్క రోజు ఆ బ్రాండ్‌ కోసం షూట్‌ లో పాల్గొంటే 265 కోట్ల రూపాయలు ఇస్తామన్నా కూడా జార్జ్‌ క్లూనీ మాత్రం ఆసక్తి చూపించలేదు. అందుకు ఆయన చెబుతున్న కారణం కాస్త విచిత్రంగా ఉంది. ఇంతకు ఆయన చెబుతున్న విషయం ఏంటీ అంటే ఆ విమాన సంస్థ ఏదేశంకు చెందినదో ఆ దేశంపై ఆయనకు మొదటి నుండి మంచి అభిప్రాయం లేదట.. ఆ దేశం పై తనకు ఉన్న అభిప్రాయం కారణంగా అంత భారీ ఆఫర్‌ ను తిరష్కరించాడట.

ఆ దేశంలో తరచు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని.. అక్కడ ఎప్పుడు కూడా సామాన్య ప్రజలు ప్రశాంతంగా ఉండటం లేదని.. పైగా ప్రతి ఒక్కరికి అక్కడ అభద్రత ఉంటుందట. అలాంటి దేశంకు చెందిన విమానయాన సంస్థకు తాను పబ్లిసిటీ చేయడం అంటే ఆ దేశం యొక్క పద్దతులు మరియు ఆ దేశ విధానాలను సమర్థించినట్లు అవుతుందని.. ఆ దేశంను గొప్పగా ప్రజెంట్‌ చేసినట్లుగా అవుతుందనే ఉద్దేశ్యంతో సదరు విమానయాన సంస్థ ఇచ్చిన 35 మిలియన్ ల యూఎస్ డాలర్ల ఆఫర్‌ ను తిరష్కరించాడట. ఈ విషయంలో జార్జ్‌ క్లూనీ తీసుకున్న నిర్ణయం ఆయన్ను రియల్ లైఫ్ లో కూడా సూపర్‌ స్టార్‌ గా నిలబెట్టింది అనడంలో సందేహం లేదు.