Begin typing your search above and press return to search.

కోలీవుడ్ లో తొలి రిలీజ్ జీవీ ప్ర‌కాష్ దేన‌ట‌

By:  Tupaki Desk   |   18 Jun 2021 4:30 AM GMT
కోలీవుడ్ లో తొలి రిలీజ్ జీవీ ప్ర‌కాష్ దేన‌ట‌
X
జి.వి.ప్రకాష్- దివ్య భారతి జంట‌గా నటించిన బ్యాచిలర్ టీజర్ విడుదలై అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకుపోయిన సంగ‌తి తెలిసిందే. నిజ‌ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాలో జీవీ ఎంతో ఎన‌ర్జిటిక్ గా న‌టించాడ‌ని టీజ‌ర్ చెప్ప‌క‌నే చెప్పింది. వాలెంటైన్స్ డే సందర్భంగా జివి ప్రకాష్ కుమార్ బ్యాచిలర్ టీజర్ యూట్యూబ్ స‌హా అన్ని సోషల్ మీడియాల్లో దుమారం రేపింది.

టీవీ జి.వి.ప్రకాష్ నిబద్ధత క‌లిగిన‌ ప్రేమికుడిగా ఈ చిత్రంలో కనిపిస్తాడు. అతను తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడే మాస్ కుర్రాడిగా ప్రేమికుడిగా అల‌రించ‌నున్నాడు. ఒక అమ్మాయిని (దివ్య భారతి పోషించిన) ఫాలో అయ్యాక ఎలాంటి ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగాయి? చివ‌రికి త‌న ప్రేమ‌ను ద‌క్కించుకున్నాడా లేదా అన్న‌దే ఈ సినిమా క‌థాంశం.

హీరోయిన్ గా దివ్యభారతి.. డైరెక్టర్ గా సతీశ్ సెల్వకుమార్ పరిచయం అవుతున్నారు. 2020 అక్టోబర్ లోనే సినిమా రెడీ అయ్యింది. 2021 ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే కానుకగా టీజర్ ను విడుదల చేశారు. కానీ సెకండ్ వేవ్ వ‌ల్ల రిలీజ్ ఆల‌స్య‌మైంది. ఇక‌పై 50శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు తెరుచుకోనున్నాయి కాబ‌ట్టి జీవీ సినిమాని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. లాక్ డౌన్ అనంత‌రం రిలీజ‌య్యే తొలి చిత్రం ఇదే కాబోతోంద‌ని తెలుస్తోంది. దర్శకుడు మిస్కిన్ అతిథి పాత్రను పోషించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమారే సంగీతం అందించాడు. దిల్లీబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.