Begin typing your search above and press return to search.

తొలి ద‌ర్శ‌కుడి ఆఫ‌ర్.. ఎస్ చెప్పిన‌ పాయ‌ల్‌!

By:  Tupaki Desk   |   24 Jan 2021 11:45 AM GMT
తొలి ద‌ర్శ‌కుడి ఆఫ‌ర్.. ఎస్ చెప్పిన‌ పాయ‌ల్‌!
X
న‌టులు ఎవ‌రికైనా తమ మొద‌టి సినిమా ద‌ర్శ‌కుల‌పై ఎంతో అభిమానం ఉంటుంది. ఎందుకంటే.. వారు ఛాన్స్ ఇచ్చి ఉండ‌క‌పోతే.. తెర‌పైకి క‌నిపించే అవ‌కాశం వ‌చ్చి ఉండేది కాదు. అందుకే.. వారి విష‌యంలో సాఫ్ట్ కార్న‌ర్ తో ఉంటారు. తాజాగా ఆర్ఎక్స్100 భామ పాయ‌ల్ రాజ్ పుత్ కూడా త‌న మొద‌టి సినిమా డైరెక్ట‌ర్ విష‌యంలో అదేవిధంగా స్పందించింది.

ఆర్ఎక్స్100 మూవీ యూత్ లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సినిమాతో పాయ‌ల్ యూత్ గుండెల్లో మంట‌లు రేపింది. త‌న అంద‌చందాల‌తో మ‌తులు పోగొట్టింది. ఆ చిత్రానికి దర్శకుడు అజయ్ భూపతి. ఈ డైరెక్ట‌ర్ ఓ రొమాంటిక్ యాక్షన్ డ్రామాను తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. అదే ‘మహా సముద్రం’.

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో.. యంగ్ బ్యూటీస్ అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఐటెం సాంగ్ లో న‌ర్తించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. తన తొలి చిత్ర దర్శకుడు ప్ర‌త్యేక గీతం కోసం సంప్ర‌దించ‌డంతో.. పాయ‌ల్ హ్యాపీగా ఓకే చెప్పేసింద‌ట‌. పాయల్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో రెండు సినిమాల్లో న‌టిస్తోంది.