దర్శకుడి తెలివితేటలు అలా ఉన్నాయి మరి!

Mon May 25 2020 15:00:31 GMT+0530 (IST)

The director's intelligence is like that

ఆయనో టాప్ డైరెక్టర్. క్రేజ్ ఉంది కాబట్టి తను దర్శకత్వం వహించే సినిమాలకు భారీ పారితోషికమే పుచ్చుకుంటాడు. అయితే ఆయన తన సంపాదనను జస్ట్ డైరెక్షన్ కు మాత్రమే పరిమితం చేయకుండా వేరే రకాలుగా సంపాదిస్తున్నాడట.  దీనికి ఆయన పెట్టుబడి ఏంటంటే కేవలం సినీ పరిశ్రమలోని పరిచయాలే.ఇప్పటికే ఇలా ఆయన ఓ పెద్ద స్టార్ హీరోకు ఒక ప్రాజెక్టు సెట్ చేశాడు. ఈ దర్శకుడు చొరవ చూపకపోతే ఈ ప్రాజెక్టు సెట్ అయ్యేది కాదట.  ఈ ప్రాజెక్టు సెట్ చేసినందుకు ఫీజుగా భారీ మొత్తమే అందుకొబోతున్నాడట. ఇదే రూట్లో మరో సినిమాను ఓ బడా నిర్మాణ సంస్థకు- మెగా హీరోతో సెట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.  దీని కోసం ఓ యువ దర్శకుడు తయారు చేసుకున్న కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి హీరో ను మెప్పించేలా తనవంతు సహాయం చేస్తున్నాడట.  దీనికి కూడా మంచి ఫీజే దక్కుతుందట.  ఇలా భవిష్యత్తులో కూడా ఇతరులకు సినిమాలు సెట్ చెయ్యాలనే ఆలోచనలో ముందుకు సాగిపోతున్నాడట.

పాత కాలంలో అయితే దర్శకుడు తన పని మాత్రమే తనది అనేలా ఉండేవాడు. ఇప్పుడు అలా కాదు.  దీపం ఉండగానే ఇల్లును.. ఫామ్ హౌసును చక్కబెట్టుకోవాలనే సామెతను ఫాలో అవుతూ అన్నిరకాలుగా సంపాదిస్తున్నారు.  మంచిదే.. రెండు ఫ్లాపులు తగిలితే ఎంత పెద్ద  స్టార్ డైరెక్టర్ ను అయినా పక్కన పెట్టేస్తారు. అంతలోపే సంపాదించుకోవాలి.