హీరోయిన్ గా రాబోతున్న ప్రముఖ నటి కూతురు..!

Sun Mar 07 2021 16:00:01 GMT+0530 (IST)

The daughter of a famous actress who is coming as a heroine ..!

"శ్రీదేవి.." అసాధారణమైన నటనతో సౌత్ నార్త్ అనే తేడాలేకుండా ఇండియన్ సెల్యులాయిడ్ పై ఆమె వేసిన ముద్ర చిరస్మరణీయం. అలాంటి నటీమణి వారసులు ఇండస్ట్రీకి వస్తున్నారంటే.. వారిపై ప్రత్యేకమైన దృష్టి నెలకొనడం సహజం. ఇప్పటికే బాలీవుడ్ లో పాదం మోపిన అతిలోక సుందరి పెద్ద కూతురు జాన్వీ కపూర్.. దూసుకెళ్తోంది.ఇప్పుడు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా వెండి తెరకు పరిచయం అయ్యేందుకు రంగం సిద్ధమైంది. అయితే.. శ్రీదేవి కూతురు అన్న బ్రాండ్ తోనే కాకుండా.. నటనలో తనదైన ప్రతిభ కనబరిచేందుకు న్యూయార్క్ లో శిక్షణ తీసుకుని మరీ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతోందీ ఖుషీ.

న్యూయార్క్ లోని ప్రముఖ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ "ఫేమస్ లీ స్ట్రాస్బెర్గ్" లో ఏడాది కోర్సు పూర్తిచేసి వచ్చిందీ చిన్నది. ఇదే క్రమంలో తాను తొలి చిత్రంలోనే మరింత అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తోందని టాక్. అందుతున్న సమాచారం ప్రకారం.. 2022లో ఈ బ్యూటీ డెబ్యూ మూవీ ఉండొచ్చని తెలుస్తోంది.

అయితే.. ఈ భామను ఎవరు లాంఛ్ చేస్తారన్నది తెలియాల్సి ఉంది. శ్రీదేవి పెద్దకూతురు జాన్వీని మాత్రం కరణ్ జోహార్ పరిచయం చేశారు. మరి ఖుషీని బోనీకపూర్ ఎవరి చేతిలో పెడతాడో చూడాలి. మరోవైపు.. తన ఇద్దరు కూతుళ్లతో సినిమాలు తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు బోనీ. ఫైనల్ గా ఎవరి సినిమా ద్వారా ఖుషీ తెరంగేట్రం చేస్తుందో చూడాలి.