నీహారికపై 9వ తరగతిలోనే కుట్ర జరిగిందట!

Tue Feb 23 2021 23:00:02 GMT+0530 (IST)

The conspiracy against the niharika took place in the 9th standerd

మెగా ప్రిన్సెస్ నీహారిక - చైతన్య జొన్నల గడ్డ వివాహం గత ఏడాది డిసెంబర్ లో జరిగింది. ఈ వెడ్డింగ్ లో మెగాస్టార్ చిరంజీవి .. పవన్ కల్యాణ్ సహా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ హీరోలంతా సందడి చేయగా.. ఆ తర్వాత రిసెప్షన్ కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి.అయితే ఇప్పటికీ ఈ పెళ్లి వెనక సీక్రెట్స్ బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువే. అసలు ఇది ప్రేమ పెళ్లా?  లేక కేవలం పెద్దలు కుదిర్చిన వివాహమా? అంటే... తమది లవ్ మ్యారేజ్ కాదని నీహారిక అన్నారు. పెళ్లి తర్వాత నీహారిక- చైతన్య జంటగా తొలిసారి ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆ విషయాన్ని చెప్పుకొచ్చారు.

స్కూల్ డేస్ లో చైతన్య-వరుణ్ క్లాస్ మేట్స్ .. కానీ తనకు చైతన్యతో పరిచయం లేనే లేదని నీహారిక తెలిపారు. దీనిపై చైతన్య స్పందిస్తూ.. 9వ తరగతిలోనే వరుణ్ నేను క్లాస్ మేట్స్. ఒకటి రెండుసార్లు వాళ్ళ ఫాదర్ ని కలిశాను అని తెలిపారు. అప్పుడు వరుణ్ కి సిస్టర్ ఉన్న సంగతి తెలీదా? అని చైతన్యను ప్రశ్నించారు నీహారిక. ``తెలుసు`` అని చైతన్య అనగానే..9వ తరగతి నుంచే ఇదంతా నా వెనుక కుట్రలా జరిగింది! అంటూ గలగలా తనదైన శైలిలో నీహారిక నవ్వేసింది. 2019లో తొలిసారి చైతన్యను కలిసానని నీహారిక తెలిపారు. లాక్ డౌన్ సమయంలో తమమధ్య అనుబంధం పెరిగిందని వెల్లడించారు.

7నెలల కాలంలో ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నామని నీహారిక వెల్లడించింది. ఆ టైమ్ లో బయట కలవకపోయినా తను ఇంటికి రావడం వల్ల ఒకరికొకరం కలుసుకోగలిగాం అని నీహారిక చాలా సంగతులే తెలిపింది. పెళ్లికి ముందు తామిద్దరం వీడియో కాల్స్ ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లమని నీహారిక వెల్లడించారు. చైతన్య స్నేహం.. తన ఆలోచనలు ఎక్కువగా నచ్చుతాయని తెలిపారు.