Begin typing your search above and press return to search.

క్లాసిక్‌ మూవీ అఫిషియల్‌ రీమేక్ అప్ డేట్ వచ్చేసింది

By:  Tupaki Desk   |   1 March 2021 8:30 AM GMT
క్లాసిక్‌ మూవీ అఫిషియల్‌ రీమేక్ అప్ డేట్ వచ్చేసింది
X
క్రియేటివ్ డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగమార్తాండ' సినిమా కోసం ఆయన అభిమానులు దాదాపుగా మూడు ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నారు. మరాఠి క్లాసిక్‌ మూవీకి అఫిషియల్ రీమేక్‌ అయిన రంగమార్తాండ సినిమా లో పలువురు సీనియర్‌ నటీనటులతో పాటు శివాత్మిక రాజశేఖర్‌ మరియు రాహుల్‌ సిప్లిగంజ్ వంటి యంగ్‌ స్టార్స్ కూడా నటిస్తున్నారు. సినిమా నాటక రంగంకు సంబంధించిన ఈ సినిమా లో బ్రహ్మానందం చాలా వైవిధ్యభరితమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే విడుదలైన ఫొటో తో దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఇక కృష్ణవంశీ భార్య అయిన రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. పలు కారణాల వల్ల ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్‌ ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమా షూటింగ్‌ ముగించుకుని ఫస్ట్‌ కాఫీ సిద్దం అయ్యిందంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు సినిమా కు సంబంధించిన టైటిల్‌ మినహా మరే అఫిషియల్‌ టీజర్ కాని వీడియో కాని విడుదల చేయలేదు. షూటింగ్ పూర్తి అయ్యి విడుదలకు సిద్దం అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు పెట్టే అవకాశం ఉంది. ఎట్టకేలకు రంగమార్తాండ షూటింగ్‌ ముగిసింది అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీ విషయమై అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా లో ప్రకాష్‌ రాజ్‌.. అనసూయలు కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.