Begin typing your search above and press return to search.

#పుష్ప .. దేవీశ్రీ ముందు ఉన్న స‌వాల్ అదే

By:  Tupaki Desk   |   19 Jun 2021 11:30 PM GMT
#పుష్ప .. దేవీశ్రీ ముందు ఉన్న స‌వాల్ అదే
X
సుకుమార్ తో దేవీశ్రీ ప్ర‌సాద్ కాంబినేష‌న్ అన‌గానే తొలిగా ఆర్య - ఆర్య‌2 లాంటి మ్యూజిక‌ల్ చార్ట్ బ‌స్ట‌ర్స్ ని త‌ల‌వాల్సిందే. ఆ రెండు సినిమాల నుంచి పాట‌లు చాలాకాలం పాటు రింగ్ టోన్లుగా అల‌రించాయి. ఆ రేంజులో దేవీశ్రీ మ్యూజిక్ యూత్ కి క‌నెక్టయిపోయింది. అందుకే పుష్ప చిత్రం కోసం ఆ ఇద్ద‌రూ మ‌ళ్లీ క‌లిసి ప‌ని చేస్తున్నారు అన‌గానే మ్యూజిక్ ల‌వ‌ర్స్ లో ఒక‌టే ఆస‌క్తి నెల‌కొంది.

అయితే ఆ రేంజులో దేవీశ్రీ ఈసారి కూడా పాట‌ల్ని అందించ‌గ‌ల‌రా? అన్న‌ది అభిమానుల్లో ఉత్కంఠ‌గా మారింది. ఇటీవ‌లే అల వైకుంఠ‌పుర‌ములో పాట‌లు చార్ట్ బ‌స్ట‌ర్ హిట్స్ గా నిల‌వ‌గా.. పోటీబ‌రిలో దేవీ శ్రీ సంగీతం అందించిన‌ స‌రిలేరు నీకెవ్వ‌రు పాట‌లు యావ‌రేజ్ గా నిలిచాయ‌న్న టాక్ వినిపించింది. అందుకే ఇప్పుడు పుష్ప‌తో ఆ అప‌వాద‌ను స‌వ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ బిగ్ ఛాలెంజ్ ని దేవీశ్రీ ఎలా స్వీక‌రించ‌నున్నారు? అన్న‌ది హాట్ టాపిక్ గా మారింది.

`పుష్ప` నుంచి తొలి సింగిల్ విడుద‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. జూలై మొద‌టి వారంలో పుష్ప తొలి పాట బన్ని అభిమానుల‌కు అదిరిపోయే ట్రీటివ్వ‌నుంద‌న్న టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే తొలి పాట ఓ రేంజులో కుదిరింద‌ని బ‌న్ని.. సుకుమార్ సంతృప్తిక‌రంగా ఉన్నార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. ఇంత‌కుముందు రిలీజ్ చేసిన పోస్ట‌ర్లు టీజ‌ర్ తో హైప్ పెరిగింది. ఈ మొద‌టి పాట‌తో మ‌రింత హైప్ పెర‌గ‌డం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది.

పుష్ప రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది. మొద‌టి భాగం స‌క్సెస్ సాధించ‌డంలో దేవీశ్రీ పార్ట్ 50శాతం ఉంటుంద‌ని అభిమానుల అంచ‌నా. అత‌డు త‌న మ్యూజిక్ తోనే బోలెడంత మ్యాజిక్ చేస్తాడ‌ని భావిస్తున్నారు. తెలుగు-త‌మిళం-హిందీ స‌హా అన్ని భాష‌ల్లోనూ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. చైనాలో క్లైమాక్స్ తెర‌కెక్కిస్తార‌ని తెలుస్తోంది.