షారుఖ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్.. అందరి కళ్ళూ అక్కడే!

Wed Jan 25 2023 09:56:15 GMT+0530 (India Standard Time)

The biggest release of ShahRukh Khan's career

జీరో సినిమాతో ఒక భారీ డిజాస్టర్ అందుకున్న షారుక్ ఖాన్ ఆ తర్వాత జీరో అయిపోయాడని ఇక ఆయన సినిమాలు చేయడం ఆపేస్తాడని కూడా అనేక ప్రచారాలు జరిగాయి. ఆ తర్వాత కూడా షారుఖ్ ఖాన్ ఎలాంటి చప్పుడు చేయకుండా ఉండడంతో నిజంగా ఆయన సినిమాలకు దూరమై పోతాడేమో అని ఆయన అభిమానులు అందరూ ఎంతగానో బాధపడ్డారు. అయితే అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఆయన కొన్ని సినిమాలలో అతిథి పాత్రలలో నటిస్తూ ఉండడంతో వారిలో కొంత ఆశ మిగిలింది. అయితే ఎప్పుడైతే పఠాన్ లాంటి సినిమా చేస్తున్నట్టు ప్రకటించారో ఇక వారందరూ గుండెల మీద చేయి వేసుకున్నారు.ఎందుకంటే సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని వారికి నమ్మకం ఉంది. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం పఠాన్. షారుక్ ఖాన్ సరసన దీపికా పదుకొనే నటించిన ఈ సినిమాలో జాన్ అబ్రహం ఒక కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సిద్ధార్థ ఆనంద్ కధ అందించగా శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే అందించారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు నుంచి తెలుగు తమిళ హిందీ భాషలలో పెద్ద ఎత్తున విడుదలవుతోంది.

అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 7700 స్క్రీన్ లలో విడుదలవుతోంది. ఒక్క భారతదేశంలోనే 5200 స్క్రీన్స్ కాగా ఓవర్సీస్ లో మరో 2500 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది. ఒక రకంగా షారుఖ్ ఖాన్ కెరీర్ లో ఇది అత్యధిక భారీ రిలీజ్ అని చెప్పొచ్చు. హిందీతో పాటు తెలుగు తమిళ భాషల్లో కూడా విడుదలవుతూ ఉండడంతో కలెక్షన్స్ మీద కూడా అంచనాలు పెరుగుతున్నాయి.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హైదరాబాద్ చరిత్రలోనే మరే హిందీ సినిమాకి లేనంతగా ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ తో పాటు బుకింగ్స్ కూడా నమోదయ్యాయి. దీంతో మొదటి వసూళ్లతో రోజు సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. మరి చూడాలి పఠాన్ దెబ్బకు షారుఖ్ ఖాన్ మళ్లీ సెట్ రైట్ అయ్యి వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తాడేమో అనేది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.