ఏకంగా కోటిన్నర అడిగేస్తున్న కుర్ర బ్యూటీ

Tue Jul 20 2021 14:24:49 GMT+0530 (IST)

The beauty who is asking for One And Half crore

కోటి పారితోషికం అన్న ఊహే భయపెడుతుంది. అలాంటిది ఆ కుర్ర హీరోయిన్ ఏకంగా కోటిన్నర అడిగేస్తోందట. ఆవిడ మొహమాటం లేని డిమాండ్ కి టాలీవుడ్ నిర్మాతల గుండెల్లో దడ మొదలైందని గుసగుసలు వినపిస్తున్నాయి. అంతగా కెరీర్ పరంగా బిజీగా లేకపోయినా ఈ అమ్మడి డిమాండ్లు విన్నాక పలువురు నిర్మాతలు షాక్ లో ఉన్నారట.ఇంతకీ ఎవరీ భామ? అంటే.. ఇస్మార్ట్ శంకర్ ఫేం నిధి అగర్వాల్. టాలీవుడ్ కెరీర్ లో ఇప్పటివరకూ ఒకే ఒక్క హిట్ అందుకుంది. అంతకుముందు నటించినవన్నీ పెద్ద ఫ్లాపులే. కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ లేకపోతే ఐరన్ లెగ్ అని పిలిచే పరిస్థితి ఉండేది. కానీ నిధికి జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలిచ్చి మన నిర్మాతలు ఎంకరేజ్ చేస్తున్నారు.

తాజా సమాచారం మేరకు.. నిధి కోటిన్నర అడుగుతున్నందునే  తెలుగులో ఆఫర్లు తగ్గిపోయాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపున తమిళంలో మాత్రం పారితోషికం పరంగా కండీషన్ లేకపోవడంతో ఆఫర్లు బాగానే వస్తున్నాయి. అయితే తమిళంలో బొద్దుగుమ్మలకే పెద్ద హీరోల సరసన ఆఫర్లు వస్తాయి.. దీంతో ఈ బ్యూటీ కెరీర్ అక్కడ కూడా నత్తనడకనే సాగుతుందని చెబుతున్నారు. ఇప్పటికి వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని పారితోషికంలో బెట్టు చేయకపోతే.. కాస్తయినా పట్టు విడుపు ఉంటేనే మునుముందు కెరీర్ సాగే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. మరి నిధి ఇతరుల మాటను ఖాతరు చేస్తుందా? అన్నది తనకే వదిలేయాలి.