Begin typing your search above and press return to search.

నాభి అందాల ఎరకు చిక్క‌రులే శ్ర‌ద్ధా

By:  Tupaki Desk   |   7 Feb 2023 4:00 PM GMT
నాభి అందాల ఎరకు చిక్క‌రులే శ్ర‌ద్ధా
X
ద‌శాబ్ధం పైగా తెలుగు సినీప‌రిశ్ర‌మ చుట్టూ ప్ర‌కాశిస్తూనే ఉంది శ్ర‌ద్ధా దాస్. కానీ త‌న కెరీర్ లో మాత్రం ఆశించిన వెలుగులు లేవు. అటుపై త‌మిళం-క‌న్న‌డం-మ‌ల‌యాళం -హిందీలోను న‌టిగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నించింది. కానీ ఆశించిన రేంజు స్టార్ కాలేక‌పోయింది. ఓవైపు పెద్ద తెర అవ‌కాశాలు త‌గ్గాయి. అదే క్ర‌మంలో బుల్లితెర‌ను ఆశ్ర‌యించింది. రియాలిటీ షోల జ‌డ్జిగాను మారింది.

బెంగాళీ బ్యూటీ శ్ర‌ద్ధా దాస్ కెరీర్ ఆరంభమే 'ఆర్య 2' సినిమాలో వ్యాంప్ త‌ర‌హా పాత్ర‌లో న‌టించింది. అది త‌న‌కు చాలా మైన‌స్ అయ్యింద‌ని అప్ప‌ట్లో వాపోయింది. కానీ ఆ త‌ర్వాత క‌థానాయిక‌గా కొన్ని సినిమాల్లో న‌టించింది. ఇంత‌కుముందు 'గుంటూరోడు'లో హీటెక్కించే లుక్ తో యాక్ష‌న్ రాణిగా మెప్పించింది. అడ‌పాద‌డ‌పా స‌హాయ‌క పాత్ర‌ల్లో న‌టిస్తూనే.. ఇటీవ‌ల‌ బుల్లితెర‌పై వ‌చ్చీ రాని తెలుగులో జ‌డ్జిమెంట్ తో టీవీక్ష‌కుల‌కు గ్లామ‌ర్ కంటెంట్ ని అందించింది.

శ్ర‌ద్ధా ఫోటోషూట్ల తోను జోష్ ప్ర‌ద‌ర్శిస్తూనే ఉంది. ముఖ్యంగా ఇన్ స్టాలో నిరంత‌రం ఫాలోవ‌ర్స్ ని పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది చాలాసార్లు చీర‌లో త‌న అందాల‌ను ఆర‌బోసేందుకు ప్ర‌య‌త్నించిన ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి. ఇప‌పుడు మ‌రోసారి శ్ర‌ద్ధా దాస్ శారీ లుక్ అంత‌ర్జాలంలో గుబులు రేపుతోంది. అలా స్వేచ్ఛ‌గా అందాలను కెమెరా ముందు ఆర‌బోయ‌డ‌మెలానో ఈ అమ్మ‌డి త‌ర్వాతే.
శ్రద్ధా దాస్ ఇటీవ‌ల నాభి సౌంద‌ర్యాన్ని ఎలివేట్ చేస్తూ మేకోవ‌ర్ ఫోటోలతో హాట్ నెస్ కోషెంట్ ని పెంచింది.

అంతేకాదు.. నేటిత‌రాన్ని ఉద్ధేశించి ఒక స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. "మీరు చేయలేరని ఎవరైనా చెబితే ఒక‌టికి రెండుసార్లు చేసి చూపించాలి!" అంటూ ఇటీవ‌ల స్ట్రాంగ్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. అందుకేనేమో ఇలా చీర‌లో ప‌దే ప‌దే నాభి సొగ‌సును ఆవిష్క‌రిస్తూ కుర్ర‌కారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

అయితే శ్ర‌ద్ధా లుక్ ఇప్పుడు మ‌రీ బొద్దుగా మారిపోయింది క‌దా! అంటూ నెటిజ‌నులు కామెంట్లు చేస్తున్నారు. దానికి గ‌తంలోనే శ్ర‌ద్ధా జ‌వాబిచ్చింది. "నా చిన్నతనంలో పాఠశాలలో సన్నజాజి శిరిలా లేనందుకు నన్ను బాడీ-షేమ్ చేసిన వారంద‌రికీ ధన్యవాదాలు. నా తల్లి నాకు నేను విలువనివ్వడం నేను ఎలా ఉన్నానో అది చూసి గర్వపడటం నేర్పింది. మీ శరీరాన్ని మీరు ఇష్ట‌ప‌డండి. దానిని త‌యారు చేసుకోండి!" అని క్లాస్ తీస్కుంది. "నేను ప్రతిరోజూ నా జీవనశైలిలో భాగంగా యోగా జుంబాను ఇష్టపడతాను. దానితో పాటు టన్నుల కొద్దీ ఇంట్లో వండిన రుచికరమైన ఆహారం తింటాను!" అంటూ అస‌లు విష‌యం చెప్పేసింది. శ్ర‌ద్ధా మ‌రీ ఇంత ముద్దుగా బొద్దుగా ఎందుకు ఉంటుందో ఇప్ప‌టికైనా అభిమానులు అర్థం చేసుకోవాలి!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.