Begin typing your search above and press return to search.

మెగాస్టార్ మూవీతో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన రచయిత!

By:  Tupaki Desk   |   23 Jan 2021 11:40 AM GMT
మెగాస్టార్ మూవీతో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన రచయిత!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలకాలంగా పేరున్న సినీరచయిత లక్ష్మి భూపాల్. ఎన్నో సినిమాలకు ఆయన రచయితగా పనిచేసాడు. కానీ ఇంతవరకు ఆయనకు రచయితగా రావాల్సిన గుర్తింపు రాలేదు. ఎప్పటినుండో ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అతనికి ఖచ్చితంగా బ్రేక్ అవసరం. లక్ష్మిభూపాల్ రచయితగా పనిచేసిన సినిమాలలో చాలా వరకు హిట్స్ ఉన్నాయి. కానీ ఏ స్టార్ హీరో సినిమాకి కూడా తన రచన సహకారం అందించలేకపోయాడు లక్ష్మి. లక్ష్మి భూపాల్ ప్రస్తుతం మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన రచయితగా.. అలా మొదలైంది, చందమామ, మహాత్మా, కళ్యాణ వైభోగమే, నేనే రాజు నేనే మంత్రి, సీత, ఓ బేబీ ఇలా చాలా సినిమాలకు తన రచనలు అందించాడు. కానీ ఒక్క స్టార్ హీరో సినిమా పడితే కెరీర్ టర్న్ అవుతుందనే ఆశతో ఉన్నాడట లక్ష్మిభూపాల్. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్, దర్శకనిర్మాతలు కోరుకునేది మెగాస్టార్ లాంటి మేటి నటుల సినిమాలకు పని చేయాలనీ.. తాజాగా అలాంటి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసాడు లక్ష్మిభూపాల్.

అవును తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించనున్న లూసిఫర్ రీమేక్ మూవీ రైటింగ్ బాధ్యతను మెగాస్టార్ స్వయంగా లక్ష్మిభూపాల్ కు అప్పగించినట్లు సమాచారం. మాములుగా మెగాస్టార్ తన సినిమాల పట్ల, స్క్రిప్ట్ పట్ల ఎంతో జాగ్రత్త వహిస్తూ బడా రచయితలకు తన సినిమాలను అప్పగిస్తాడు. కానీ ఈసారి మాత్రం బడా రచయితలను పక్కన పెట్టి లక్ష్మిభూపాల్ చేతిలో పెట్టడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం కానీ ఆనందించాల్సిందే. అయితే లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి రూపొందించిన అన్ని సినిమాలకు వర్క్ చేసాడు లక్ష్మి. ఇక డైరెక్టర్ మోహన్ రాజా తెలుగులో 'హనుమాన్ జంక్షన్' సినిమాతో దర్శకుడుగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. కానీ ఆ తర్వాత మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు. మళ్లీ మెగాస్టార్ లూసిఫర్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే మోహన్ రాజా, లక్ష్మిభూపాల్ ఇద్దరూ కలిసి లూసిఫర్ స్క్రిప్ట్ సాలిడ్ గా రెడీ చేశారట. ఇక ఈ సినిమా లక్ష్మిభూపాల్ కెరీర్ లో బిగ్ మూవీ. ఇది హిట్ అయితే ఈ రచయితకు స్టార్ హీరోల నుండి వరుస అవకాశాలు వచ్చే సూచనలున్నాయి. చూడాలి మరి ఏం చేయనున్నాడో!