నోరు జారి వారి రిలేషన్ ను బయట పెట్టిన నటుడు

Thu Jun 10 2021 10:07:40 GMT+0530 (IST)

The actor who slipped his mouth and exposed their relationship

బాలీవుడ్ లో ఈమద్య కాలంలో విక్కీ కౌశల్ మరియు కత్రీనా కైఫ్ ల ప్రేమ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం వీరి జోడీ మరియు వీరి లవ్ టాపిక్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అనడంలో సందేహం లేదు. పెద్ద ఎత్తున వీరి గురించి మీడియాలో మరియు నెట్టింట ప్రచారం జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు వీరు నోరు తెరిచి స్పందించలేదు. అలా అని తమ ప్రేమ వ్యవహారంను ఖండించనూ లేదు. దాంతో వీరి వ్యవహారం నిజమే అని చాలా మంది అనుకుంటున్నారు. ఈ సమయంలో బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్ తనయుడు హర్ష వర్థన్ కపూర్ ఒక టాక్ షో లో మాట్లాడుతూ విక్కీ కౌశల్ మరియు కత్రీనా కైఫ్ ల మద్య ఉన్న వ్యవహారంపై స్పందిస్తూ ఇన్ని రోజులు ఉన్న అనుమానాలను పటాపంచలు చేశాడు.నిప్పు లేనిదే పొగ రాదు అని సామెత ఉంది. అన్నట్లుగానే కత్రీనా కైఫ్ మరియు విక్కీ కౌశల్ ల మద్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లుగా హర్ష వర్థన్ క్లారిటీ ఇచ్చాడు. అతడు ఒక టాక్ షో లో మాట్లాడుతూ.. విక్కీ మరియు కత్రీనాలు రిలేషన్ లో ఉన్నారు అనేది నిజమే అన్నాడు. ఈ మాటలు మాట్లాడినందుకు నేను వివాదంలో పడే అవకాశం ఉంది. అయినా కూడా ఉన్నవాస్తవం అన్నట్లుగా అతడు చెప్పుకొచ్చాడు. హర్ష వర్థన్ కపూర్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా నెట్టింట విక్కీ కౌశల్ మరియు కత్రీనాల హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి.

గతంలో కత్రీనా కైఫ్ ప్రేమ వ్యవహారాల దృష్ట్యా ఈయనతో ఎంత కాలం పాటు రిలేషన్ కొనసాగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో విక్కీ కౌశల్ పై కొందరు కామెంట్స్ చేస్తున్నారు. విక్కీ కౌశల్ కు మరే హీరోయిన్ దొరకలేదా అంటున్నారు. సీనియర్ హీరోయిన్ అయిన కత్రీనా వెంట పడటం ఎందుకు అంటున్నారు. మొత్తానికి వీరిద్దరి ప్రేమ వ్యవహారం బాలీవుడ్ వర్గాల్లో మరియు నెట్టింట తెగ ట్రెండ్డింగ్ అవుతూ ఉంది. అయితే హర్షవర్థన్ వ్యాఖ్యలపై విక్కీ మరియు కత్రీనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.