Begin typing your search above and press return to search.

నాజూకు అందాలతో సందేశమిస్తున్న పొడుగుకాళ్ళ సుందరి

By:  Tupaki Desk   |   8 April 2020 2:30 AM GMT
నాజూకు అందాలతో సందేశమిస్తున్న పొడుగుకాళ్ళ సుందరి
X
అందాల మెరుపు తీగలా కనిపించే హీరోయిన్ కృతి సనన్ మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే సూపర్ స్టార్ మహేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. సూపర్ స్టార్ మహేష్ '1 నేనొక్కడినే' చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా పరిచయమైంది. ఆ చిత్రం నిరాశపరచినప్పటికీ కృతి నాజూకు అందాలు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత కృతి సనన్ నాగచైతన్య సరసన 'దోచెయ్' చిత్రంలో నటించగా అది కూడా నిరాశపరిచింది. దీనితో కృతి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. బాలీవుడ్ లో 'లూకా చుప్పి', 'హౌస్ ఫుల్ 4' లాంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కృతి సనన్ గ్లామర్ రోల్స్ చేస్తూనే నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలని కూడా ఎంచుకుంటోంది. ప్రస్తుతం కృతి బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకు పోతోంది. అంతే కాకుండా కృతి సనన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో లవ్ లో పడిందనే పుకార్లతో కూడా వార్తల్లో నిలుస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఈ అందాల బరిణ తన హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది.

ఇదిలావుండగా కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో ఇంటికే పరిమితమైన సెలెబ్రెటీలు రకరకాల వ్యాపకాలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళు చేసే వంటల వీడియోలను, వర్క్ ఔట్ వీడియోలను, డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కృతి సనన్ మాత్రం యోగాసనాలతో ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ఈ రోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఆమె పెట్టిన పోస్ట్ చేసిన ఫోటో ఒకటి ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. 'మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి.. అదే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. లేజీ నెస్ నుండి బయటకు వచ్చి వ్యాయామాలు చేయండి, కొన్ని మ్యాట్ వర్క్ ఔట్స్, యోగా లేదా డాన్స్ లాంటివి చేసి ఫిట్నెస్ కాపాడుకోమని జాగ్రత్తలు చెబుతోంది ఈ నాజూకు భామ.