Begin typing your search above and press return to search.

రామ్‌ అక్కడ మళ్లీ సూపర్ హిట్ అయ్యాడోచ్‌..!

By:  Tupaki Desk   |   30 Nov 2022 2:30 AM GMT
రామ్‌ అక్కడ మళ్లీ సూపర్ హిట్ అయ్యాడోచ్‌..!
X
ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద ఇస్మార్ట్‌ శంకర్ సినిమా తో సక్సెస్‌ దక్కించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. కానీ ఎప్పటిలాగే రామ్‌ ది వారియర్ సినిమా హిందీ యూట్యూబ్‌ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. మిలియన్‌ ల కొద్ది వ్యూస్ రావడంతో పాటు మిలియన్ లైక్స్ వచ్చి సరికొత్త రికార్డు నమోదు అయ్యింది.

రామ్‌ నటించిన మెజార్టీ సినిమాలు హిందీలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. నేను శైలజ మొదలుకొని ఎన్నో సినిమాలు హిందీలో సూపర్ హిట్ అయ్యి మిలియన్స్ కొద్ది వ్యూస్ దక్కడంతో రామ్‌ కు హిందీలో మంచి ఫాలోయింగ్‌ దక్కింది. అక్కడ రామ్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా లింగు స్వామి దర్శకత్వంలో వచ్చిన ది వారియర్‌ సినిమా తెలుగు మరియు తమిళ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. కానీ హిందీలో మాత్రం తక్కువ సమయంలోనే ఏకంగా 50 మిలియన్‌ ల వ్యూస్ ను దక్కించుకోవడం ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. రామ్‌ అంటే అక్కడ ప్రేక్షకుల్లో ఉన్న అభిమానంకు ఇది ప్రత్యక్ష నిదర్శణం అంటున్నారు.

రామ్ పవర్ ఫుల్‌ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. రామ్‌ యొక్క బాడీ లాంగ్వేజ్ తో పాటు యాక్షన్‌ సన్నివేశాలు హిందీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యి ఉంటాయి. అందుకే అక్కడ భారీగా వ్యూస్ వస్తున్నాయి. రామ్‌ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా కచ్చితంగా వందల మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకోవడం ఖాయం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.