వైరల్: రాజ్ తరుణ్ పారిపోతున్న విజువల్స్!

Tue Aug 20 2019 17:29:04 GMT+0530 (IST)

The Visuals of Raj Tarun Running Away From Car

యంగ్ టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు మంగళవారం తెల్లవారు ఝామున ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మొదట్లో మరో హీరో తరుణ్ కారు యాక్సిడెంట్ అని పొరపాటుగా కథనాలు వెలువడ్డాయి కానీ తరుణ్ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఆ కన్ఫ్యూజన్ కు తెరపడింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి లోని అల్కాపురి టౌన్ షిప్ వద్ద రోడ్డు పక్కన ఉన్న ఒక గోడను ఢీ కొట్టి చెట్లలోకి దూసుకెళ్ళడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం.  కారు అద్దాలు ధ్వంసమయ్యాయి కానీ సేఫ్టీ బెలూన్స్ తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్నవారు గాయాలబారిన పడలేదట.అయితే యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ఉన్న సిసిటీవీలలో ఈ కారు యాక్సిడెంట్ జరిగిన తర్వాత కారును వదిలేసి పారిపోతున్న ఒక వ్యక్తి విజువల్స్ రికార్డ్ అయ్యాయి.  దీంతో ఆ వ్యక్తి రాజ్ తరుణ్ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  షూటింగ్ ముగించుకొని తిరిగివచ్చే సమయంలో ఈ సంఘటన జరిగి ఉంటుందని అంటున్నారు.  అయితే సిసిటీవీ విజువల్స్ లో మాత్రం రాజ్ తరుణ్ ఫేస్ కనపడడం లేదు.  ఒకవేళ కారును వదిలేసి వెళ్ళిపోయింది రాజ్ తరుణ్ అయితే అలా ఎందుకు చేశాడో తెలియాల్సి ఉంది. రాజ్ తరుణ్ మద్యం సేవించి కారు నడిపి ఉంటాడా? అనే దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారట.  

ప్రమాదానికి గురైన కారు లీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన కారని సమాచారం. ఆ కారు నెంబర్  TS 09 EX 1100. ఈ యాక్సిడెంట్ లో ఎవరికీ గాయాలు కాలేదు.. ప్రాణ నష్టం కూడా జరగలేదు.  ఏం తప్పు లేకుండా.. ఇతరులు ఎవరికీ గాయాలు కానప్పుడు కారు డ్రైవ్ చేసే వ్యక్తి అలా ఎందుకు పారిపోతారు?  అయినా ఇలా ఎందుకు కారును వదిలేసి వెళ్ళిపోయాడో తెలియాంటే రాజ్ తరుణ్ స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సిందే.  అయితే ఇప్పటి వరకూ ఈ సంఘటనపై రాజ్ తరుణ్ స్పందించలేదు.