'జాలీ ఎల్ ఎల్ బీ' నుంచి మూడో ప్రాంచైజీ!

Mon Aug 15 2022 05:00:02 GMT+0530 (India Standard Time)

The Third Franchise from Jolly LLB

కోర్టు రూం ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్నిఅలరించిన  'జాలీ  ఎల్ ఎల్ బీ' ప్రాంచైజీ సక్సెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సుభాష్ కపూర్ తెరకెక్కించిన రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లని సాధించాయి. మొదటి భాగంలో హర్షద్ వార్షీ.. బోమన్ ఇరానీ.. అమృతరావు..సౌరభ్ శుక్లా ప్రధాన పాత్రల్లో మెప్పించారు.అటు పై 'ఎల్ ఎల్ బీ-2'లో అక్షయ్ కుమార్..అనుకపూర్..హ్యూమా ఖురేషీ పాత్రలు అద్యంతం అలరించాయి. రెండు భాగాలు నాలుగేళ్ల గ్యాప్ లో తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు. తాజాగా 'ఎల్ ఎల్ బీ -3' కి రంగం సిద్దం అవుతుందా? అంటే అవుననే తెలుస్తోంది. మూడవభాగాన్ని వచ్చే ఏడాది తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

రెండవ భాగంలో ప్రధాన పాత్ర పోషించిన అక్షయ్ కుమార్ నే హీరోగా కొనసాగుతున్నారు.  సుభాష్ కపూర్ దర్శకత్వంలో  స్టార్ స్టూడియోస్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.  ఇప్పటికే స్ర్కిప్ట్ వర్కూ కూడా పూర్తి చేసారు. వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ ప్రారంభించి అన్ని పనులు పూర్తి చేసి అదే ఏడాది చివర్లో నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు.

వాస్తవానికి ఈ చిత్రాన్ని కూడా నాలుగేళ్ల గ్యాప్ లోనే  తెరకెక్కించాలనుకున్నారు. కానీ అక్షయ్ బిజీ షెడ్యూల్ కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సహా సౌత్ లోనూ సినిమాలు చేయడంతో వీలుపడలేదు.  

ప్రస్తుతం అక్షయ్ కుమార్ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. 'కట్ పుత్లీ'..'రామ్ సేతూ'.. 'సెల్పీ'..'ఓ మైగాడ్ -2'..'క్యాప్సుల్  గిల్'.. 'బడేమియా చోటా మియా' షూటింగ్ లో బిజీగా ఉన్నారు.  వీటిలో కొన్ని షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి.

మరికొన్ని ఆన్  సెట్స్ లో ఉండటంతో అక్షయ్ తీరిక లేకుండా గడుపుతున్నారు. అలాగే తెలుగులో మంచి రోల్స్ వస్తే నటించడానికి అక్షయ్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ మార్కెట్ స్పాన్ పెరిగిన  నేపథ్యంలో బాలీవుడ్ స్టార్స్ అంతా ఇటువైపుగానే చూస్తున్నారు.  ఈ నేపథ్యంలో అక్షయ్ సైతం సౌత్ విషయంలో సీరియస్ గానే ఆలోచన చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.