'అఖండ' :పూర్ణతో శ్రీకాంత్ సీన్సే కీలకం

Sun May 16 2021 16:00:01 GMT+0530 (IST)

The Srikanth scene with Poorna is crucial

హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్న శ్రీకాంత్ కెరీర్ కూడా ఇప్పుడు అంత గొప్పగా లేదని చెప్పాలి. శ్రీకాంత్ వెర్సటైల్ యాక్టర్. కెరీర్ ప్రారంభంలో నెగిటివ్ రోల్స్ గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో జగపతి బాబు మాదిరిగా ఇప్పుడు శ్రీకాంత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఛాలెంజింగ్ రోల్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న 'అఖండ' సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. ఈ క్యారెక్టర్‌తో శ్రీకాంత్ మరో కోణంలో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడం గ్యారెంటీ అని భావిస్తున్నారు. హీరోయిన్ పూర్ణతో శ్రీకాంత్ సీన్స్ ...కథని పూర్తిగా మలుపు తిప్పబోతున్నాయి. ఆ సీన్స్ ప్లాష్ బ్యాక్ లో వస్తాయి. ఆ సీన్స్ లో శ్రీకాంత్ దుర్మార్గానికి పరాకాష్టగా కనపడతాడంటున్నారు. విలనిజం పీక్స్ కు వెళ్లేలా బోయపాటి డిజైన్ చేసారట.ఆ సీన్ల నుంచే శ్రీకాంత్ కు బాలయ్యకు మధ్య వైరం స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఆ క్రమంలోనే బాలయ్య ..ఓ రకమైన విరక్తితో కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోతాడని అయితే ఇంటర్వెల్ కు మళ్లీ వెనక్కి వస్తాడనిఅయితే అఖండగా మారి వస్తాడంటున్నారు. అప్పటికే మరో బాలయ్య సమస్యలో ఉంటాడని ఇద్దరూ కలిసి సెకండాఫ్ లో చెలరేగిపోతాడంటున్నారు. ఇక 'అఖండ' లో శ్రీకాంత్ ఒక్కడే విలన్ కాదు..ఇంకా చాలా మంది ఉన్నారు. కాకపోతే శ్రీకాంత్ పాత్రకు వెయిటేజ్ ఎక్కువుందని సమచారం.

ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అఖండ’. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ‘అఖండ’ టైటిల్ రోర్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది... కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌కి ఆయన అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

ఎన్‌బీకే - బోయపాటిల కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి వస్తోన్న ‘అఖండ’లో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. . ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడిగా సి.రాంప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మాటలు: ఎం.రత్నం స్టంట్‌మాస్టర్లుగా రామ్ - లక్ష్మణ్ పనిచేస్తున్నారు. మే 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.