Begin typing your search above and press return to search.

షూటింగ్ నా అందాలతో ప్రారంభిస్తా.. అంటున్న స్టార్ హీరోయిన్

By:  Tupaki Desk   |   4 April 2020 1:30 AM GMT
షూటింగ్ నా అందాలతో ప్రారంభిస్తా.. అంటున్న స్టార్ హీరోయిన్
X
'ఆర్ఆర్ఆర్' దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం. స్టార్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల అంచనాలు రోజురోజుకి అందలాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే మోషన్ పోస్టర్ తో ఆకట్టుకున్న రాజమౌళి, తాజాగా రాంచరణ్ అల్లూరి లుక్ ని రివీల్ చేసి ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ గడువు ఏప్రిల్ 14న ముగుస్తుందని సమాచారం అందడం తో ఆర్ఆర్ఆర్ టీమ్ మే నెలలో షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తుందట.

ఇక ఈ సినిమా లో రాంచరణ్ కి తోడుగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించనుంది. లాక్ డౌన్ అనంతరం అలియా భట్ తో షూటింగ్ ప్రారంభిస్తారట. అలియా భట్ ఇంతవరకు ఒక్కరోజు కూడా ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొనలేదు. తాజా కథనాల ప్రకారం అలియా భట్ తో మొదట సాంగ్ షూట్ చేయనున్నారట దర్శకుడు రాజమౌళి. ఆ తర్వాత ఆమె తో కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేసే ప్లాన్ చేస్తున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ఇప్పటికే రాజమౌళి తెలియజేసిన విషయం విధితమే. ఇప్పటి వరకు 80% షూటింగ్ పూర్తయిందట. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నందున అభిమానులు రోజురోజుకి ఆర్ఆర్ఆర్ నుండి కొత్త న్యూస్ కోసం చూస్తున్నారు. ఇప్పటికే రాంచరణ్ పాత్ర లుక్ ని విడుదల చేయడంతో మే 20న విడుదల చేయబోయే ఎన్టీఆర్ లుక్ కోసం అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మరి మొదటగా అలియా పోరాట సన్నివేశాల కంటే సాంగ్ షూట్ చేసి అలియా అందాలను బంధిస్తాడేమో అని అభిమానులు గుసగుసలాడుతున్నారు.