టాప్ స్టోరి: ముద్దుగుమ్మల పుట్టుమచ్చ చెప్పే రహస్యాలు

Thu Nov 24 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

The Secrets Telling Birthmarks of Star Actress

పుట్టుమచ్చ ... అది ఉన్న స్థానాన్ని బట్టి అందం ఇనుమడిస్తుంది. ముఖ్యంగా మగువల్లో హాట్ నెస్ ని పెంచుతుంది. అందాల నయనతారకు పెదవి పై అంచున ఉన్న పుట్టుమచ్చ సంథింగ్ స్పెషల్. సీనియర్ నటి రేఖ పెదవి మీదుగా ఆ పుట్టుమచ్చ మీడియా గ్లేర్ లో ప్రతిసారీ హైలైట్ అయ్యేది. నాటి బాలీవుడ్ అగ్ర హీరోలు రేఖ అంటే పడి చచ్చేవారు అందుకే. అలియా భట్ - కియారా అద్వానీ -అనుష్క శర్మ ఇలా భామల అందాన్ని పుట్టుమచ్చలు ప్రత్యేకంగా ఇనుమడింపజేశాయని అభిమానులు చెబుతుంటారు. అయితే మరో కోణంలో చూస్తే బయటికి కనిపించే పుట్టుమచ్చల వెనక చాలా అర్థం ఉంటుందిట. నిజానికి  శాస్త్రం తెలిసిన పండితుల ప్రకారం ఆ మచ్చల వెనక చాలా రహస్యాలే ఉంటాయిట.



నేటితరం అందాల కథానాయిక కియారా అద్వానీకి గడ్డం ఎడమ వైపున పుట్టుమచ్చ ఉంది. శాస్త్రం ప్రకారం... ఎడమ వైపున ఉన్న పుట్టుమచ్చ అతను/ఆమె పూర్తిగా నిజాయితీతో ఉంటుందని ఇండికేషన్. అలాగే మొద్దుబారిన వ్యక్తిత్వం వారిది అని సూచిస్తుంది. ఆర్.ఆర్.ఆర్ లో సీతగా నటించి మెప్పించిన అలియా భట్ కి తన నుదిటికి కుడి వైపున కనిపించే బ్యూటీ స్పాట్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె అందమైన వ్యక్తిని వివాహం చేసుకుంటుందని ఈ మచ్చ సూచిస్తుందనేది జోస్యం. తాను కోరుకున్న అందగాడు రణబీర్ నే ఆలియా పెళ్లాడింది.

అనుష్క శర్మకు కూడా ఆమె గడ్డం మీదుగా  దవడ అంచున అందమైన పుట్టుమచ్చ ఉంది. దీని అర్థం.. ఆప్యాయతలో కొండంత.. శ్రద్ధగా ఉండటంలో ఆకాశం ఎత్తున ఉంటారని ...ఇది సూచిస్తుంది. అనుష్క శర్మ నటిగా నిర్మాతగా కూడా ఫెయిల్ కాకపోవడానికి ఆ రెండూ ప్రధాన కారణాలు. వ్యక్తిగత జీవితంలోను తాను కోరుకున్న క్రికెటర్ ప్రియుడు విరాట్ ని కొంగున కట్టేసుకుందంటే అనుష్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలి. పుట్టుమచ్చ తెచ్చిన గొప్ప అదృష్టమని కూడా శాస్త్రం విశ్లేషించింది.

శ్రద్ధా కపూర్ తన కింది పెదవి దిగువన అందమైన స్పాట్ ని కలిగి ఉంది. పెదవి కింద పుట్టుమచ్చ ఉన్నవారికి థియేటర్ రంగంపై అమితాసక్తి ఉంటుందని శాస్త్రం సూచిస్తుంది. ఆషిఖి 2 -ఏక్ విలన్- సాహో చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల హృదయాలను శ్రద్ధా కొల్లగొట్టింది. నటిగా తనను తాను నిరూపించుకుంది.

కత్రినా కైఫ్ పెదవి పైన పుట్టుమచ్చతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది ప్రకృతితో మమేకమయ్యే వ్యక్తిత్వాన్ని.. ఆహార ప్రియత్వాన్ని సూచిస్తుంది.  జీవితంలో అత్యుత్తమమైన వాటిని సాధించేందుకు కూడా ప్రయత్నాలు సాగుతాయని ఈ మచ్చ చెబుతుంది. అనుకున్నట్టే బాలీవుడ్ రైజింగ్ హీరో విక్కీ కౌశల్ ని పెళ్లాడి జీవితంలోను సెటిలైంది.

నయనతార పుట్టుమచ్చ నిజానికి ఆమె అందానికి అదనపు ఆకర్షణ. తన అందమైన పెదవి మీదుగా ఒక పుట్టుమచ్చ ఎంతో మనోహరంగా ఉంటుంది. ఇది నాయకురాలు కాబోయే లక్షణం అనేది శాస్త్రం చెబుతోంది. తలైవి అన్న పిలుపు కూడా అందుకే నయన్ కి యూనిక్ గా దక్కింది. ప్రజలచే ఆమోదించబడిన గొప్ప వ్యక్తిత్వం అని ఈ పుట్టుమచ్చ సూచిస్తుందిట.

బాలీవుడ్ ఎవర్ గ్రీన్ నటి రేఖ తన పైపెదవికి పైన ఉన్న పుట్టుమచ్చతో ఎంతో ఆకర్షణ ఉన్న నటిగా పాపులరైంది. అయితే ఈ పుట్టుమచ్చ ఒరిజినల్ కాదన్న సంగతి చాలా మందికి తెలీదు. ఇది కృత్రిమమైనదని ఆమె స్వయంగా వెల్లడించింది. అయితే అందాల మచ్చలు ఉన్న బాలీవుడ్ నటీమణులు చాలా మంది ఉన్నారు. ఈ మచ్చలు ఆస్ట్రాలజీ ప్రకారం దేనిని సూచిస్తాయి? అన్నది కూడా ఆసక్తికరం. ఇక తెలుగు సినీపరిశ్రమలో రాణించేందుకు పుట్టుమచ్చలతో కాకుండా పెట్టుడు మచ్చలతో ప్రయత్నించే భామలకు కొదవేమీ లేదన్నది ఒక సర్వే రిపోర్ట్. ముఖ్యంగా టీవీ ఇండస్ట్రీలో ఇలాంటి నటీమణులు ఎక్కువగా ఉన్నారట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.