Begin typing your search above and press return to search.

ట్యాక్సీవాలా రియాలిటీ ఇదీ

By:  Tupaki Desk   |   8 Nov 2018 5:08 PM GMT
ట్యాక్సీవాలా రియాలిటీ ఇదీ
X
విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన `ట్యాక్సీవాలా` విష‌యంలో జ‌రుగుతున్న ప్ర‌చారం గురించి తెలిసిందే. ఈ సినిమా ఆన్‌ లైన్‌ లో లీకైపోయింది. సినిమా మొత్తం చాలా మంది చూసేశారు. అయినా థియేట‌ర్ల‌లో ఎలా రిలీజ్ చేస్తారు? అంటూ సామాజిక మాధ్య‌మాల్లో వేడెక్కించే ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు త‌మ‌ సినిమాని ఎట్టిప‌రిస్థితిలో గ‌ట్టెక్కించాల‌న్న క‌సితో దేవ‌ర‌కొండ అండ్ టీమ్ చాలానే శ్ర‌మిస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ మ‌రోసారి త‌నదైన‌ ప్ర‌చారంతో వైవిధ్యానికి ప‌దును పెడుతూ మీడియాలోనూ ద‌ర్శ‌న‌మిస్తున్నాడు.

ట్యాక్సీవాలా ఈనెల 17న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. రాహుల్ సంకృత్యాయ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని యువి క్రియేష‌న్స్ - గీతా ఆర్ట్స్ 2 సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. సినిమాకి యుఏ స‌ర్టిఫికెట్ ద‌క్కింది. తాజాగా ఈ సినిమాపై సాగుతున్న నెగెటివ్ ప్ర‌చారానికి కౌంట‌ర్ వేస్తూ క్రియేటివ్‌ గా ఓ వీడియోని రిలీజ్ చేశారు. `రియాలిటీ బిహైండ్ ట్యాక్సీవాలా` పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియో ఆక‌ట్టుకుంటోంది.

కొంద‌రు పిల్ల‌ల‌తో రౌడీ ట్యాక్సీవాలా త‌న‌దైన స్టైల్లో ముచ్చ‌టిస్తూ అస‌లు తెర‌వెన‌క ఏం జ‌రిగిందో ఆ క‌థంతా చెప్పాడు. సినిమాల గురించి ముచ్చ‌ట్లు పెడుతున్న‌ట్టే పెట్టి, అస‌లు ట్యాక్సీవాలా రిలీజ్ కాకుండా ఎలా చూసేశారు? ఇంకా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ అయినా చేయ‌కుండా.. గ్రాఫిక్స్ అయినా అద్ద‌కుండా .. అస‌లు రిలీజ్ అన్న‌దే చేయ‌కుండానే ఎలా చూసేశారు? అంటూ దేవ‌ర‌కొండ ప్ర‌శ్నించాడు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్.. ఎడిట్.. సౌండ్ .. వీఎఫ్ ఎక్స్ .. అదింకా పూర్తి కాని సినిమా అంటూ చెప్ప‌డం చూస్తుంటే జ‌నాల‌కు తెలివిగానే క్లారిటీ ఇచ్చాడు.