రజనీ డైరెక్టర్ కాపీ కొట్టాడంటూ రచయిత ఆరోపణ

Sun Oct 18 2020 14:21:45 GMT+0530 (IST)

The Rajini director is also advertised as a copycat!

రజనీ డైరెక్టర్ కూడా కాపీ క్యాటే అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం సాగుతోంది. కార్తిక్ సుబ్బరాజ్ `పిజ్జా` మూవీతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. మంచి టెక్నీషియన్ గా పేరు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజ్ సూపర్ స్టార్ రజనీతో `పేట్టా` చిత్రాన్ని చేశాడు కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. తాజాగా ధనుష్ హీరోగా గ్యాంగ్ స్టర్ థ్రిల్లర్ `జగమే తంత్రమ్` చిత్రాన్ని రూపొందించాడు. ఈ మూవీ త్వరలో రిలీజ్ కాబోతోంది.ఇదిలా వుంటే సుధా కొంగర.. గౌతమ్ వాసుదేవమీనన్.. సుహాసిని మణిరత్నం.. రాజీవ్ మీనన్ లతో కలిసి కార్తీక్ సుబ్బరాజు పేరుతో రూపొందించిన అంథాలజీ `పుథమ్ పుధు కాలి` మొత్తం ఐదు భాగాలుగా రూపొందింది. ఈ షార్ట్ ఫిల్మ్స్ లలో ఐదవ షార్ట్ ఫిల్మ్ `మిరాకిల్`ని కార్తీక్ సుబ్బరాజు రూపొందించాడు. ఈ స్టోరీని తన వద్ద నుంచి కాపీ కోట్టారని రచయిత అజయన్ బాల ఆరోపిస్తున్నాడు. ఇటీవలే దీన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేశారు.

తన ఫ్రెండ్ వల్ల తెలుసుకున్న అజయన్ బాల తను చేసిన `సచిన్ క్రికెట్ క్లబ్`ని కాపీ చేశారని సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అత్యధిక భాగం విదేశాల్లో ఈ అంథాలజీని తెరకెక్కించారు. పది మంది నేపథ్యంలో సాగే కథ ఇదని ఒక్క రోజులో జరిగే కథ ఇదని అజయన్ బాల చెబుతున్నాడు. `పుథమ్ పుధు కాలి` అంథాలజీ కూడా ఇదే తరహా కథతో సాగుతుండటంతో కార్తీక్ సుబ్బరాజు కూడా కాపీ క్యాట్ గా మారిపోయాడని సెటైర్లు వేస్తున్నారు.