Begin typing your search above and press return to search.

ఈ ఏడాది అదిరిపోయే 'క్లైమాక్స్' ఎవరిదంటే?

By:  Tupaki Desk   |   7 Dec 2022 2:30 AM GMT
ఈ ఏడాది అదిరిపోయే క్లైమాక్స్ ఎవరిదంటే?
X
గతేడాది కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లలోకి సినిమాలు చాలా తక్కువగానే వచ్చాయి. అయితే ఈ ఏడాది తొలి నుంచి లాక్ డౌన్ ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేయడం.. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరిచారు. దీంతో 2022 సంవత్సరంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలకు నోచుకున్నాయి.

2022 లో తెలుగు సినిమాల హవా నడిచింది. మిగతా ఇండస్ట్రీలోనూ ఆయా భాషలు సినిమాలు విడుదలై మంచి విజయాలను సాధించాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సక్సెస్ రేట్ తక్కువగానే నమోదైంది. అయితే ఈసారి బాలీవుడ్ సినిమాల కంటే కూడా తెలుగు.. కన్నడ సినిమాలే అత్యధికంగా కలెక్షన్లు రాబట్టి సత్తా చాటింది.

దర్శకుడు ధీరుడు రాజమౌళి గత నాలుగేళ్లుగా తెరకెక్కిస్తూ వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సైతం 2022 లోనే విడుదలైంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. విడుదలైన అన్ని భాషల్లోనూ భారీగా కలెక్షన్లు రాబట్టింది.

ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' జపాన్ భాషలోనూ రిలీజై మంచి టాక్ తో దూసుకెళుతోంది. జపాన్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ సినిమాను రికార్డు సృష్టించింది. ఇక కన్నడ హీరో యశ్ నటించిన 'కేజీఎఫ్-2' కూడా ఈ ఏడాదే రిలీజైంది. కేజీఎఫ్ మొదటి కలెక్షన్ల తిరగరాస్తూ కన్నడలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా కూడా విడుదలైన అన్ని భాషల్లో మంచి టాక్ తెచ్చుకొని 'కేజీఎఫ్' హవాను కొనసాగించింది.

చిన్న బడ్జెట్లో తెరకెక్కిన 'కార్తీకేయ-2' తెలుగులోనే కాకుండా హిందీలోనూ భారీ వసూళ్లను రాబట్టింది. నిఖిల్ కెరీర్లో తొలి వంద కోట్ల సినిమాగా 'కార్తీకేయ-2' మూవీ నిలిచింది. ఈ మూవీలో నిఖిల్ కు జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. అలాగే కమలహాసన్ నటించిన తమిళ చిత్రం 'విక్రమ్ వేద' సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాతో కమల్ హాసన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.

అదేవిధంగా కన్నడ 'కాంతార' చిత్రం అనుహ్య విజయం సాధించింది. దేవుడి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ కన్నడలో తొలుత భారీ విజయం సాధించారు. ఈ తర్వాత తెలుగు, హిందీ భాషల్లో డబ్ చేయబడి భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది.ఈ సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

వీటితోపాటు పలు చిన్న సినిమాలు సైతం ఈ ఏడాది సత్తా చాటాయి. ఆయా భాషల్లోని అభిమానులను అలరించాయి. అయితే వీటిలో ఏ చిత్రం క్లైమాక్స్ బాగుందనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. ఈ సినిమాల్లో మీకు ఏ సినిమా క్లైమాక్స్ నచ్చిందో కింద కామెంట్ చేయండి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.