Begin typing your search above and press return to search.

జనాలు మర్చిపోకముందే ఓటిటిలో రిలీజ్ చేయండి: సినీవిశ్లేషకులు!

By:  Tupaki Desk   |   3 Aug 2020 4:45 AM GMT
జనాలు మర్చిపోకముందే ఓటిటిలో రిలీజ్ చేయండి: సినీవిశ్లేషకులు!
X
కరోనా మహమ్మారి వలన లాక్‌డౌన్ ప్రారంభంలో సినిమా థియేటర్లన్ని మూతపడిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా మహమ్మారి ప్రభావం అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ఇక ఇళ్లకు పరిమితం అయిన జనాలకు ఓటీటీ ఫ్లాట్ ఫాములు మంచి వినోదం అందిస్తున్నాయి. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్.. ఆహా.. హాట్ స్టార్ వంటి ఆన్ లైన్ ప్లాట్ ఫాములకు మంచి ఆధారణ పెరుగుతోంది. రోజురోజుకి ఓటీటీలలో విడుదల అవుతున్న తెలుగు సినిమాల జాబితా కూడా అలాగే పెరుగుతుంది. కానీ మీడియం బడ్జెట్.. హై బడ్జెట్ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు ముందుకు రావడం లేదు. ఎందుకంటే మా సినిమా ఓటీటీ సినిమా కాదు. థియేటర్లలో చూడాల్సిన సినిమా అంటూ చెబుతున్నారు. ఇక ఇంకా విడుదలకు సిద్ధమైన సినిమాలను నేరుగా ఓటిటిలో రిలీజ్ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం జనాలలో థియేటర్లకు వెళ్లి సినిమా చూసేంత సీన్ కనిపించడం లేదు.

ఖచ్చితంగా ఈ ఏడాది ముగిస్తే గాని వస్తారో రారో తెలియదు. ఈలోపు జనాలలో ఆగిపోయిన సినిమాల మీద ఇంట్రెస్ట్ పోకుండా ఉండాలంటే.. థియేటర్లలో విడుదలై హిట్ అయ్యే ఛాన్సులు తక్కువుగా ఉన్న సినిమాలను నేరుగా ఓటిటిలో రిలీజ్ చేస్తే బాగుంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ డెబ్యూ హీరో.. ఉప్పెన సినిమాను మైత్రి వారు డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేస్తే మంచిదినే సలహాలు వినిపిస్తున్నాయి. ప్రొడక్షన్, మ్యూజిక్ మినహాయిస్తే ఉప్పెన సినిమాలో మిగిలిన వారంతా కొత్తవారే కావడంతో డైరెక్జ్ ఓటిటి రిలీజ్ బెటర్ అంటున్నారు. కానీ మూవీ నిర్మాతలు మాత్రం విడుదల విషయంలో కాస్త గట్టిగానే ఉన్నారట. థియేటర్లు ఎప్పుడు తెరిస్తే అప్పుడే సినిమా రిలీజ్ చేయాలనే ఆలోచనలో వారున్నట్లు సమాచారం. కానీ డైరెక్టర్ కూడా కొత్తవాడే కావడంతో ఓటిటిలో రిలీజ్ చేస్తే మంచిదని అనుకుంటున్నట్లు టాక్. చూడాలి మరి ఆగిన సినిమాల నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..!