Begin typing your search above and press return to search.

'ది ఘోస్ట్' రిలీజ్ ట్రైలర్: హై ఇంటెన్స్ యాక్షన్ తో అదరగొట్టిన నాగ్..!

By:  Tupaki Desk   |   30 Sep 2022 11:39 AM GMT
ది ఘోస్ట్ రిలీజ్ ట్రైలర్: హై ఇంటెన్స్ యాక్షన్ తో అదరగొట్టిన నాగ్..!
X
కింగ్ అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం "ది ఘోస్ట్". క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కింది. దసరా సందర్భంగా రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

ఇప్పటి వరకూ 'ది ఘోస్ట్' సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన లభించింది. థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ రిలీజ్ ట్రైలర్ ను ఆవిష్కరించారు.

'ది ఘోస్ట్' సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ తో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. అండర్ వరల్డ్ అంతా ఘోస్ట్ ముందు మోకాళ్ళ మీద నిలబడి దయ చూపమని కోరడంతో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది.

ప్రమాదంలో చిక్కుకున్న సోదరి.. 20 ఏళ్ల తర్వాత తమ్ముడు సహాయం కోరడంతో ఇంటర్ పోల్ ఆఫీసర్ అయిన విక్రమ్ (నాగార్జున) రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తన అక్క మరియు మేన కోడలిని కాపాడుకోడానికి అతను మొత్తం అండర్ వరల్డ్ తో వార్ కు రెడీ అయ్యాడు.

నాగార్జున ఇంటెన్స్ రోల్ లో స్టైలిష్ యాక్షన్ తో అదరగొట్టాడు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెప్పినట్లుగా శివ - అంతం సినిమాల్లో నాగ్ ని గుర్తు చేసాడు. నాగ్ సబార్డినేట్‌ గా హీరోయిన్ సోనాల్ చౌహాన్ గ్లామర్ ట్రీట్ అందించింది. గుల్ పనాగ్ - అనిఖా సురేంద్రన్ - జయప్రకాష్ - రవి వర్మ ఇతర పాత్రల్లో కనిపించారు.

'ఇన్నేళ్ల తర్వాత గుర్తొచ్చి పిలిచావా అని అడుగుతావా?.. అవసరం కోసం పిలిచావా అని అడుగుతావా?' అనే డైలాగ్ ఎమోషనల్ గా ఉంది. 'డబ్బు - సక్సెస్ సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. గ్రాండ్ విజువల్స్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి.

యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉన్నప్పటికీ థియేట్రికల్ ట్రైలర్ లాగానే రిలీజ్ ట్రైలర్ కూడా అన్ని కమర్షియల్ హంగుల మేళవింపుతో ఉంది. చివర్లో నాగార్జున కత్తితో రౌడీ గొంతు కోసే షాట్ హై ఇంటెన్స్ గా ఉంది. ప్రవీణ్ సత్తారు స్టైలిష్ మేకింగ్ మరియు యాక్షన్ థ్రిల్లర్‌ లను డీల్ చేయడంలో స్పెషలిస్ట్ అని మరోసారి నిరూపించుకున్నాడు.

హై ఇంటెన్స్ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన 'ది ఘోస్ట్' రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇది యాక్షన్ ప్రేమికులకు ఫుల్ మీల్ ఫీస్ట్ కానుందని అర్థమవుతుంది.

మార్క్ కె రాబిన్ ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయగా.. భరత్ - సౌరబ్ పాటలు అందించారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. దినేష్ సుబ్బరాయన్ - కేచా మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ - పుస్కుర్ రామ్ మోహన్ రావు - శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.

'ది ఘోస్ట్' చిత్రాన్ని అక్టోబర్ 5న తెలుగుతో పాటుగా హిందీ - తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు మేకర్స్ చేస్తున్నారు.

నాగార్జున కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా పాత్ బ్రేకింగ్ మూవీగా నిలిచిన 'శివ' రిలీజైన రోజే రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.