Begin typing your search above and press return to search.

ది ఘోస్ట్‌ అక్కడ కూడా.. ఫ్యాన్స్ లో ఉత్కంఠ

By:  Tupaki Desk   |   26 Sep 2022 7:14 AM GMT
ది ఘోస్ట్‌ అక్కడ కూడా.. ఫ్యాన్స్ లో ఉత్కంఠ
X
నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్‌ దర్శకత్వంలో రూపొందిన ది ఘోస్ట్‌ సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడ్‌ అందుకున్నాయి. ఇటీవల సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించి చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాపై అంచనాలు పెంచడంలో సఫలం అయ్యారు.

తెలుగు లో ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయబోతున్న చిత్ర యూనిట్‌ సభ్యులు తమిళం మరియు హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారట. అయితే అక్కడ పెద్దగా ప్రచారం లేకుండా తక్కువ సంఖ్యలో స్క్రీన్స్ లో విడుదల చేయబోతున్నారు. ఆ మధ్య కార్తికేయ 2 సినిమాను పబ్లిసిటీ లేకుండా తక్కువ స్క్రీన్స్ లో హిందీలో విడుదల చేసిన విషయం తెల్సిందే.

సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తే అప్పుడు స్క్రీన్స్ పెంచుకోవచ్చు.. పబ్లిసిటీ చేసుకోవచ్చు. అదే వ్యూహం తో ది ఘోస్ట్‌ సినిమాను ఉత్తరాదిన మరియు తమిళనాట విడుదల చేసే ఉద్దేశ్యంతో మేకర్స్ డబ్బింగ్‌ కార్యక్రమాలు ముగించే పనిలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

ది ఘోస్ట్‌ సినిమా కేవలం తెలుగు నేటివిటీ లో తెరకెక్కిన సినిమా కాదు.. యూనివర్శిల్‌ అప్పీల్‌ ఉన్న కథ కనుక తప్పకుండా ఈ సినిమాను అక్కడి ప్రేక్షకులు కూడా ఆధరిస్తారు అనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాలకు ఇతర భాషల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆ కారణంతోనే సినిమాను భారీ ఎత్తున కాకుండా సింపుల్ గా హడావుడి లేకుండా విడుదల చేసి ఫలితాన్ని బట్టి పెంచాలని భావిస్తున్నారు. ఇది ఒక మంచి ఆలోచన అన్నట్లుగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బ్రహ్మాస్త్ర సినిమాలో కీలక పాత్రలో నటించడం ద్వారా నాగ్‌ ఇటీవలే ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు వెళ్లాడు. అది ఈ సినిమాకు అదనపు బలం అవ్వబోతుందని అంటున్నారు. సోనాల్‌ చౌహాన్‌ నటించిన ఈ సినిమాలో నాగ్ పాత్ర మరియు లుక్‌ విభిన్నంగా ఆకట్టుకునే విధంగా ఉంటాయని దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.