Begin typing your search above and press return to search.

'ది ఘోస్ట్‌' పిల్లలకు కూడా..!

By:  Tupaki Desk   |   27 Sep 2022 6:07 AM GMT
ది ఘోస్ట్‌ పిల్లలకు కూడా..!
X
నాగార్జున.. ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్ లో రూపొందిన ది ఘోస్ట్‌ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి.

ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి సినిమాకు భారీగా అంచనాలు పెంచి జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ది ఘోస్ట్‌ టైటిల్ మరియు ఇటీవల వచ్చిన ప్రమోషనల్‌ స్టఫ్ అన్నీ చూస్తూ ఉంటే ఇది ఒక యాక్షన్‌ సినిమా అని.. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్‌ అవ్వక పోవచ్చు అనే అభిప్రాయంతో కొందరు ఉన్నారు. అందుకే ఈ సినిమా అన్ని వర్గాల వారు చూసి నచ్చే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పిల్లల కోసం అన్నట్లుగా కొన్ని సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు.

ది ఘోస్ట్‌ సినిమాలో హాలీవుడ్‌ సూపర్ మ్యాన్‌.. హిట్‌ మ్యాన్‌ సినిమాల తరహాలో కొన్ని వీఎఫ్‌ఎక్స్ షాట్స్.. సన్నివేశాలు ఉంటాయి. ఆ సన్నివేశాలు పిల్లలకు అమితంగా నచ్చుతాయి అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంతో చెబుతున్నారు. సినిమాలోని దాదాపుగా 50 శాతం సన్నివేశాల్లో వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ఉండటం వల్ల విజువల్ వండర్ అన్నట్లుగా ది ఘోస్ట్‌ ఉంటుందట.

సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు శృతి మించకుండా కథ మరియు స్క్రీన్‌ ప్లే కు అనుసారంగానే ఉంటాయని.. పిల్లలు కూడా చూసే విధంగా సెన్సార్‌ సర్టిఫికెట్‌ కోసం యూనిట్‌ సభ్యులు ప్లాన్‌ చేస్తున్నారు. క్లీన్ యూ ఎలాగూ రాకపోవచ్చు.. కనీసం యూ/ఎ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

సోనాల్‌ చౌహాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కథ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి లీక్ అయితే లేదు కానీ ఒక మంచి సబ్జెట్‌ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా మాత్రం మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్‌ గాడ్‌ ఫాదర్‌ సినిమా పోటీని తట్టుకునేలా.. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా ఉంటుందనే నమ్మకం ను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.