Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్‌ ఒత్తిడితో దిగిరాబోతున్న యూవీ క్రియేషన్స్‌

By:  Tupaki Desk   |   2 Jun 2020 6:10 AM GMT
ఫ్యాన్స్‌ ఒత్తిడితో దిగిరాబోతున్న యూవీ క్రియేషన్స్‌
X
కొన్ని రోజుల క్రితం సోషల్‌ మీడియాలో బ్యాన్‌ యూవీ క్రియేషన్స్‌ అంటూ స్వయంగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ట్రెండ్‌ చేసిన విషయం తెల్సిందే. రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ప్రభాస్‌ 20వ చిత్రం అప్‌ డేట్‌ ఇవ్వక పోవడంతో పాటు కనీసం ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల చేయకపోవడంపై ఫ్యాన్స్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభాస్‌ ఆగ్రహంను చల్లార్చేందుకు యూవీ క్రియేషన్స్‌ ఆ సమయంలో ఈ విపత్తు సమయం నుండి బయట పడ్డ వెంటనే ప్రభాస్‌ 20 చిత్రం నుండి ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌ ను ఇస్తామంటూ ప్రకటించారు.

ఆ ప్రకటన వచ్చి కూడా రెండు నెలలు అవుతుంది. అయినా ఇప్పటి వరకు యూవీ క్రియేషన్స్‌ వారు అప్‌ డేట్‌ ఇవ్వక పోవడంతో మళ్లీ ఫ్యాన్స్‌ ఒత్తిడి చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో మళ్లీ యూవీ క్రియేషన్స్‌ కు వ్యతిరేకంగా పోస్ట్‌ లు పెట్టడంతో పాటు ప్రభాస్‌ మూవీ పై బ్యాడ్‌ టాక్‌ ను స్ప్రెడ్‌ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారట. దాంతో యూవీ క్రియేషన్స్‌ ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌ రివీల్‌ చేయడంతో పాటు టైటిల్‌ ను కూడా రివీల్‌ చేసేందుకు సిద్దం అవుతున్నారట.

స్టైలిష్‌ దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్న రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. జాన్‌ అంటూ ఈ సినిమాకు టైటిల్‌ అనుకున్నారు. కాని జాను సినిమా వచ్చిన కారణంగా టైటిల్‌ ను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓ డియర్‌ తో పాటు మరో రెండు టైటిల్స్‌ కూడా ప్రచారం జరుగుతున్నాయి. ఏ టైటిల్‌ను ఖరారు చేశారు అలాగే ప్రభాస్‌ లుక్‌ ఈ చిత్రంలో ఎలా ఉంటుంది అనేది వారం లోపులోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సందర్బం ప్రత్యేకంగా ఏమీ లేకున్నా కూడా ఒత్తిడితో యూవీ క్రియేషన్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.