Begin typing your search above and press return to search.

టాలీవుడ్ డ్రగ్స్ కేసు..72మందితో జాబితా?

By:  Tupaki Desk   |   22 Sep 2020 4:30 PM GMT
టాలీవుడ్ డ్రగ్స్ కేసు..72మందితో జాబితా?
X
బాలీవుడ్ లో.. శాండిల్ వుడ్ లో ఇప్పుడు డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. కానీ ఇంతకు కొన్ని సంవత్సరాల ముందే టాలీవుడ్ లో డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. సినీ ప్రముఖులు, హీరోలు సైతం విచారణను ఎదుర్కొన్నారు. కానీ ఏమైందో కానీ టాలీవుడ్ డ్రగ్స్ కేసు మూలనపడిపోయింది. తెలంగాణ సర్కార్ ఈ కేసును నీరుగార్చిందన్న ప్రచారం జోరుగా సాగింది.

అయితే మరుగపడిపోయిన ఈ కేసు గురించి తాజాగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, ఆర్టీఐకి దరఖాస్తు పెట్టుకోగా.. ఎక్సైజ్ శాఖ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది.

ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 12 కేసులు నమోదైనట్టు .. 12 కేసుల్లో ఎనిమిదింటిలోనే చార్జ్ షీట్ దాఖలైనట్టు తెలిసింది. జాబితాలో 72మంది పేర్లు ఉన్నాయని సమాచారం. టాలీవుడ్ కు సంబంధించిన 4 కేసులపై ఎక్సైజ్ శాఖ సమాచారం ఇవ్వలేదు.

హైదరాబాద్ డ్రగ్స్ కేసు చార్జీషీట్ లో ఇంగ్లండ్, జర్మనీ నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. కొరియర్ ద్వారా డ్రగ్స్ సప్లై అయినట్టు అక్కడి నుంచి స్టీల్ బౌల్స్ పేరుతో కొకైన్, ఎల్,ఎస్.డీ వచ్చినట్టు చార్జీషీట్ లో పేర్కొన్నారు.

‘ఐపీఎస్ఐడీ.ఎల్ వో’ వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు డ్రగ్స్ బుక్ చేసినట్టు చార్జీషీట్ లో పేర్కొన్నారు. సికింద్రాబాద్ లోని మోడీ మార్కెట్ లో గల మహేశ్వర ఫార్మాలో సైతం డ్రగ్స్ తయారు చేసినట్టు తెలిపారు. ఎనిమిది చార్జీషీట్లలో కాలేజీ స్టూడెంట్స్ తోపాటు ప్రముఖుల పేర్లు ఉన్నాయని సమాచారం. టాలీవుడ్ కేసులో 72మంది పేర్లు ఉన్నాయి. విచారణకు హాజరైన 12మందితోపాటు మరో 60మందితో జాబితా ఉన్నట్టు తెలిసింది.