Begin typing your search above and press return to search.

పోర్న్‌ స్టార్‌ గా పరిచయం అవ్వబోతున్న డైరెక్టర్‌ డాటర్‌

By:  Tupaki Desk   |   20 Feb 2020 10:30 AM GMT
పోర్న్‌ స్టార్‌ గా పరిచయం అవ్వబోతున్న డైరెక్టర్‌ డాటర్‌
X
ప్రపంచ సినీ ప్రేమికులందరికి సుపరిచితుడైన డైరెక్టర్‌ స్టీవెన్‌ స్పీల్బర్గ్‌. ఎన్నో హాలీవుడ్‌ చిత్రాలు తెరకెక్కించిన ఈయన ఎంతో మంది స్టార్స్‌ ను పరిచయం చేశాడు. ప్రపంచ ప్రసిద్ది గాంచిన దర్శకుడు అయిన ఈయన తన కూతురు విషయం లో పూర్తిగా ఆమెకే స్వేచ్చను ఇచ్చాడు. దాంతో ఆమె పోర్న్‌ స్టార్‌ గా పరిచయం అవ్వాలని నిర్ణయించుకుంది. స్పీల్బర్గ్‌ కుమార్తె అయిన మైకాలా ఇప్పటికే న్యూడ్‌ ఫొటో షూట్స్‌ మరియు వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా జనాల ముందుకు తీసుకు వచ్చింది.

త్వరలో తన దర్శకత్వంలోనే పోర్న్‌ సినిమాను మొదలు పెట్టబోతుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించింది. పోర్న్‌ స్టార్‌ గా మంచి గుర్తింపు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేయబోతున్నట్లుగా ప్రకటించింది. ప్రపంచ ప్రసిద్ది గాంచిన దర్శకుడి కూతురు అయ్యి ఉండి ఇలాంటి సినిమాలు చేయండం ఏంటీ అంటూ కొందరు విమర్శిస్తుంటే మరి కొందరు మాత్రం ఆమె నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు. నీవు అనుకున్న రంగంలో విజయాన్ని సొంతం చేసుకోవాలంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాను పోర్న్‌ స్టార్‌ గా చేసేందుకు నా తల్లిదండ్రులు ఒప్పుకున్నారంటూ మైకాలా ప్రకటించింది.