Begin typing your search above and press return to search.

కేంద్రం టాలీవుడ్ ని ఎందుకు ప‌క్క‌న పెడుతోంది?

By:  Tupaki Desk   |   26 Jan 2022 11:45 AM GMT
కేంద్రం టాలీవుడ్ ని ఎందుకు ప‌క్క‌న పెడుతోంది?
X
భార‌త ప్ర‌భుత్వం ప్ర‌తీ ఏడాది ప‌ద్మ పుర‌స్కారాల్ని అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఎప్పటిలాగే రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ప‌ద్మ పుర‌స్కారాల్ని ప్ర‌క‌టించారు. అయితే అనూహ్యంగా ఈ సారి కూడా టాలీవుడ్ ఊసు ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. భార‌తీయ సినిమాకు టాలీవుడ్ స‌రికొత్త సొబ‌గుల‌ద్దుతున్న వేళ ప‌ద్మ పుర‌స్కారాల్లో టాలీవుడ్ ని విస్మ‌రించ‌డం ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. టాలీవుడ్ ని ఎందుకు ప‌క్క‌న పెట్టార‌ని వాపోతున్నారు.

ప‌ద్మ పుర‌స్కారాల్లో సీనియ‌ర్ న‌టి `షావుకారు` జాన‌కి కి ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం ల‌భించింది. అయితే ఆమె పేరుని సిఫార‌సు చేసింది మాత్రం తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కాదు. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం. ద‌ర్శ‌నం మొగిల‌య్య‌కు ఈ పుర‌స్కారాల్లో ప‌ద్మ‌శ్రీ ద‌క్కింది. ఆయ‌న‌ని తెలంగాణ ప్ర‌భుత్వం సిఫార‌సు చేసింది. అయితే టాలీవుడ్ నుంచి మాత్రం ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌భుత్వాలు ఏ ఒక్క‌రినీ ప‌ద్మ పుర‌స్కారాల‌కు సిఫార‌సు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం,

వివిధ రంగాల్లో విశిష్ట సేవ‌లు అందించిన వ్య‌క్తుల‌కు ప‌ద్మ పుర‌స్కారాల్ని గ‌త కొన్నేళ్లుగా కేంద్ర ప్ర‌భుత్వం అంద‌జేస్తున్న విష‌యం తెలిసిందే. అందేలో క‌ళా రంగానికి విశిష్ట సేవ‌లు అందించిన వ్య‌క్తుల‌కు కూడా ప‌ద్మ పుర‌స్కారాలు అందిస్తోంది. కానీ ఈ ఏడాది క‌ళారంగం విభాగంలో ఉభ‌య తెలుగు రాష్ట్రాల నుంచి ఏ ఒక్క న‌టీ, న‌టుల‌ని కానీ ఎంపిక చేయ‌క‌పోవ‌డం నిజంగా షాకే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు.

ఇలా తెలుగు క‌ళా రంగానికి చెందిన క‌ళాకారులని కేంద్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన సంద‌ర్భాలు చాలానే వున్నాయి. తాజాగా అది మ‌రోసారి జ‌రిగింది. సీనియ‌ర్ న‌టులు కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, సీనియ‌ర్ న‌టి జ‌మున‌ల‌కు ప‌ద్మ పుర‌స్కారాలు ద‌క్కాల్సింది కానీ ఇంత వ‌ర‌కు వారికి ద‌క్క‌లేదు. పైడా కొంత మందిని తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు సిఫార‌సు చేసినా కేంద్రం పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అయితే కేంద్రం గ‌త కొంత ఎందుకు తెలుగు క‌ళాకారుల్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న‌ది ఇప్పుడు స‌ర్వ‌త్రా వినిపిస్తున్న ప్ర‌శ్న‌.

కేంద్రం తెలుగు క‌ళాకారుల్ని విస్మ‌రించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం తెలుగు ప్ర‌భుత్వాలే. గ‌తంలో ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, రాజ‌మౌళికి ప‌ద్మ పుర‌స్క‌రాలు ద‌క్కాయి. అది తెలుగు రాష్ట్రాల వ‌ల్ల కాదు. రాజ‌మౌళిని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సిఫార‌సు చేస్తే , ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సిఫార‌సు చేసింది. కానీ వారిని తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు సిఫార‌సు చేయ‌లేదు. తెలుగు ప్ర‌భుత్వాలు సిఫార‌సు చేయ‌ని కార‌ణంగానే తెలుగు క‌ళాకారుల‌కు ప‌ద్మ పుర‌స్క‌రాలు ద‌క్క‌డం లేద‌ని ప్ర‌స్తుతం పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. భార‌తీయ సినిమాకు టాలీవుడ్ స‌రికొత్త సొబ‌గుల‌ద్దుతున్న వేళ ప‌ద్మ పుర‌స్కారాల్లో టాలీవుడ్ ని విస్మ‌రించ‌డం సోచ‌నీయ‌మే.