జై బాలయ్య అంటూ ఫ్యాన్స్ ని మరిగించాడా?

Mon Nov 29 2021 12:28:54 GMT+0530 (IST)

The Bunny Says Jai Balayya is over the stage

అఖండ వేదికపై బన్ని `జై బాలయ్య` నినాదం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఒక్క పిలుపుతో మెగా వర్సెస్ నందమూరి వార్ కి చెక్ పెట్టేసినట్టేనా? అంటూ పరిశ్రమ వర్గాల్లో.. అభిమానుల్లో చర్చ సాగుతోంది.ఇన్నాళ్లు ఇరు వర్గాలుగా మారి సోషల్ మీడియాల్లో ఘర్షణకు దిగిన అభిమానుల్లో ఇకపై మార్పు వస్తుందని భావిస్తున్నారు. అఖండ వేదికపై రాజమౌళితో పాటు అతిథిగా పాల్గొన్న బన్ని బాలయ్యపై తన అభిమానాన్ని చాటుకున్నారు. అల్లు అర్జున్ ఇదివరకూ బాలయ్య రికార్డుల గురించి మాట్లాడి నందమూరి అభిమానులకు చేరువయ్యారు. ఇప్పుడు ఏకంగా అఖండ వేదికపై జై బాలయ్య నినాదంతో అంతా మార్చేశారు! అన్న చర్చ సాగుతోంది. బన్ని తీసుకున్న ఇనిషియేషన్ తో ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య సఖ్యత పెరుగుతుందని దశాబ్ధాలుగా కొనసాగుతున్న వార్ కి చెక్ పెట్టేసినట్టేనని గుసగుస వినిపిస్తోంది.

మునుముందు బన్ని తరహాలోనే ఇతర మెగా హీరోలు ఇలాంటి కొత్త స్టాండ్ తీసుకుంటారా? అన్న చర్చా వేడెక్కిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తదుపరి చిత్రం `పుష్ప`కు నందమూరి అభిమానుల మద్ధతు దక్కుతుందని దీనిని బట్టి సంకేతాలు అందినట్టే. పుష్ప చిత్రాన్ని పాన్ ఇండియా కేటగిరీలో పలు భాషల్లో విడుదుల చేస్తున్న సంగతి తెలిసిందే.